Samsung : శామ్‌సంగ్ సంచలనం.. స్మార్ట్ టీవీ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి AI యాప్ లాంచ్

శాంసంగ్ స్మార్ట్ టీవీల కోసం ప్రపంచంలోనే తొలి AI-పవర్డ్ టీవీ యాప్ 'Perplexity TV App'ను లాంచ్ చేసింది. ఇది ఇన్ఫర్మేషన్, వ్యక్తిగతీకరించిన వినోదాన్ని అందిస్తూ, టీవీ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తుంది. 2025 శాంసంగ్ టీవీలలో ఈ యాప్ అందుబాటులో ఉంది.

New Update
Samsung Launched Perplexity AI Powered TV App

Samsung Launched Perplexity AI Powered TV App

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తన స్మార్ట్ టీవీ వినియోగదారుల కోసం ఒక వినూత్నమైన అనుభవాన్ని పరిచయం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి AI-పవర్డ్ టీవీ యాప్ అయిన పెర్‌ప్లెక్సిటీ టీవీ యాప్ (Perplexity TV App)ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇది సామ్‌సంగ్ 'విజన్ AI కంపానియన్' (Vision AI Companion) విస్తరణగా పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ టీవీలోనే వేగంగా సమాచారాన్ని కనుక్కోవచ్చు. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి, వినోదాన్ని మరింత ఆస్వాదించడానికి సహాయపడుతుంది. 

Perplexity AI Powered TV App

పెర్‌ప్లెక్సిటీ AI అంటే ఏంటి?

పెర్‌ప్లెక్సిటీ అనేది ఒక అధునాతన AI-ఆధారిత ఇన్ఫర్మేషన్ ఇంజిన్. ఇది సమాచారాన్ని సేకరించి వినియోగదారులకు అందిస్తుంది. కేవలం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడమే కాకుండా.. వినియోగదారులు మరింత లోతుగా సమాచారాన్ని తెలుసుకోవడానికి కొత్త ప్రశ్నలు అడగడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. సామ్‌సంగ్ టీవీలలో దీనిని ఉపయోగించినప్పుడు.. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు AI జవాబులు, సంబంధిత సూచనలు ఇస్తుంది.

ఎలా ఉపయోగించాలి?

పెర్‌ప్లెక్సిటీ టీవీ యాప్‌ను టీవీ హోమ్ స్క్రీన్ నుంచి లేదా 'విజన్ AI కంపానియన్'లోని AI బటన్ ద్వారా ఓపెన్ చెయ్యొచ్చు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. సినిమాలు, వాటి దర్శకుల గురించి తెలుసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ లేదా రోజువారీ పనులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.

ఈ సమయంలో AI వాయిస్ కమాండ్‌లను ఉపయోగించే ముందు, వినియోగదారులు యాప్ షరతులను అంగీకరించి, మైక్రోఫోన్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆన్-స్క్రీన్ కీబోర్డ్ లేదా యూఎస్‌బీ కీబోర్డ్ ద్వారా కూడా వెతకవచ్చు.

పెర్‌ప్లెక్సిటీ టీవీ యాప్ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. క్వచన్ లకు సంబంధించిన ఫలితాలు పెద్ద టీవీ స్క్రీన్‌లకు అనుగుణంగా అధిక-నాణ్యత గల కార్డ్‌ల రూపంలో కనిపిస్తాయి. ఇది కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా, ఇంటరాక్టివ్ (పరస్పర చర్య), ఆకర్షణీయమైన అనుభవాన్ని అందిస్తుంది.

ఉచిత సబ్‌స్క్రిప్షన్:

ఈ పెర్‌ప్లెక్సిటీ టీవీ యాప్ ఇప్పుడు అన్ని 2025 సామ్‌సంగ్ టీవీలలో అందుబాటులో ఉంది. 2023, 2024 మోడళ్ల టీవీ వినియోగదారులు OS అప్‌గ్రేడ్ తర్వాత ఈ యాప్‌ను పొందవచ్చు. అదనంగా సామ్‌సంగ్ వినియోగదారులందరికీ 12 నెలల పెర్‌ప్లెక్సిటీ ప్రో (Perplexity Pro) సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు యాప్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ కొత్త AI యాప్‌తో సామ్‌సంగ్ స్మార్ట్ టీవీ అనుభవం మరింత స్మార్ట్‌గా మారుతుందని కంపెనీ పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు