BREAKING : తెలంగాణ కొత్త  డీజీపీగా శివధర్ రెడ్డి.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఇదే

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి.. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌గా ఉన్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అందుకున్నారు.

New Update
Shivdhar Reddy is the new DGP of Telangana

Shivdhar Reddy is the new DGP of Telangana

BREAKING : తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి.. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌గా ఉన్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అందుకున్నారు. హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి సొంతూరు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల). ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు శివధర్ రెడ్డి హైదరాబాద్ లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్‌ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశించారు.

ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!

అనంతరం  విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలోASP గా శివధర్‌ రెడ్డి పని చేశారు. గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్ గా‌, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. జిల్లాల SP గా, DIG SIB గా మావోయిస్టుల అణిచివేతలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 2014--2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్ గా శివధర్‌ పనిచేశారు. 2016  కరుడుగట్టిన హంతకుడు నయీం ఎన్‌కౌంటర్‌ ఆపరేషన్ ను ప్లాన్‌ చేసిన క్రెడిట్‌ ఆయనకే దక్కింది. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావో లో కూడ పని చేసిన అనుభవం శివధర్ రెడ్డి కి ఉంది. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించిన అనుభవం ఉంది.

Also Read : Anaganaga Oka Raju: ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే

2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పులలో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత  శివధర్ రెడ్డిని  హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ గా  ప్రభుత్వం నియమించింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి, అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థంగా కాపాడినట్లు శివధర్ రెడ్డికి పేరుంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో రోడ్ భద్రత కోసం Arrive Alive క్యాంపెయిన్ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా పనిచేశారు. పర్సనల్ వింగ్ లో ఐజీ, అడిషనల్ డీజీగా  పని చేశారు. అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గాను అనుభవం ఉంది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్ళీ శివధర్ రెడ్డి నియామించింది. ఆగస్టు 2024 లో ఆయనకు డీజీపీగా ప్రమోషన్ లభించింది. గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో దారుణం.. లారీతో తొక్కించి ఇద్దరి హత్య.. రూ.200 కోసం!

Advertisment
తాజా కథనాలు