Khammam: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు షాక్.. తొలగిస్తూ ఉత్తర్వులు

డీఎస్సీలో ఎంపికైన ఏడుగురు హిందీ ఉపాధ్యాయులను తొలగిస్తూ ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తొలగింపునకు గురైన ఏడుగురు అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో గురువారం ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

TELANGANA LOGO
New Update

ఇటీవల తెలంగాణలో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన ఏడుగురు హిందీ ఉపాధ్యాయులను తొలగిస్తూ ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి ప్లేస్ లో అర్హులైన మరో ఏడుగురికి కొత్తగా నియామక పత్రాలు అందించారు  డీఎస్సీ నియామకాల్లో ఇలా జరగడం రాష్ట్రంలోనే ఇది అరుదైన సంఘటన అని, అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. 

Also Read:  USA: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాలను ఆపగలరా?

DSC 2024 Results

డీఎస్సీ 2024 ఫలితాలు వెలువడిన తరువాత 1: 3 నిష్పత్తిలో అర్హత సాధించిన వారి ధ్రువ ప్రతాలను పరిశీలించారు. ఇదే సమయంలో పలువురు అభ్యర్థులకు సంబంధించి అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది హిందీ పండిట్‌ అభ్యర్థులకు అర్హత లేకపోయినా ఎంపిక చేస్తున్నారన్న విషయాన్ని అధికారి దృష్టికి తీసుకుని వెళ్లారు. సంబంధిత అధికారి మాత్రం అన్ని అర్హత ప్రకారమే ఉన్నాయని క్లీన్‌ చిట్‌ ఇచ్చారు.

Also Read:  Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్‌

అనంతరం అధికారులు వారిని ఎంపిక చేసి పోస్టింగులు ఇచ్చారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు లాంగ్వేజీ పండిట్లు , ఇద్దరు స్కూల్‌ అసిస్టెంట్లను హిందీ సబ్జెక్టులో ఎంపిక చేసి నియామక పత్రాలు ఇచ్చారు. 

Also Read:  Ap Liquor Policy: ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్..!

ఇదిలా ఉంటే వీరి నియామకాన్ని సవాలు చేస్తూ ఎంపిక కాని అభ్యర్థులు ఖమ్మం జిల్లా కలెక్టరుకు , డీఈవోకు ఫిర్యాదు చేశారు. డిగ్రీలో ప్రత్యేక సబ్జెక్టుగా హిందీ లేదని, నోటిఫికేషన్‌ లో పేర్కొన్న అర్హతలు లేవని ఫిర్యాదులో చెప్పారు. దీన్ని సీరియస్‌ గా తీసుకున్న జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read:  Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే..

డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల ప్రకారం అనర్హులపై చర్యలు తీసుకున్నామని డీఈవో తెలిపారు.తొలగింపునకు గురైన ఏడుగురు అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో గురువారం ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సీఎం చేతుల మీదుగా నియామక పత్రం అందుకుని , కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తరువాత అర్హత లేదనే సాకుతో తమను తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డీఈవోను కలిసి విజ్ఙప్తి చేశారు. 

#telangana #tg dsc results 2024 #hindi-teachers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe