Nalgonda Court: జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు..నిందితుడికి 51 ఏళ్ల శిక్ష..

ఒక బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మహ్మద్‌ ఖయ్యూమ్‌ అనే వ్యక్తిపై 2021లో తిప్పర్తి పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది.

New Update
Court

Court

Nalgonda Court: ఒక బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో 2021లో తిప్పర్తి పీఎస్‌లో మహ్మద్‌ ఖయ్యూమ్‌ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా.. తాజాగా తీర్పు వెల్లడించింది. పోక్సో కేసులో తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూంను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఆయనకు 51 ఏళ్ల శిక్ష విధించింది. అత్యాచారం కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ కేసులో పదేళ్లు, సెక్షన్ 506(మైనర్ బాలికపై బెదిరింపులు) కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పును వెలువరించారు.

నిందితుడు ఖయ్యూం 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.  అంతేకాక ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే బాధితురాలు కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు ఖయ్యూంపై రేప్ కేసు నమోదు చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో న్యాయస్థానానికి సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ సమర్పించారు. దీంతో నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.

అసలేం జరిగిందంటే..


నల్గొండ జిల్లా తిప్పర్తికి చెందిన షేక్ మహ్మద్ ఖయ్యూం తిప్పర్తి మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను  ప్రేమిస్తున్నానని వెంటబడి వేధించేవాడు. ప్రతిరోజు స్కూలుకు వెళ్లే సమయంలో ఆమె వెంటపడి ప్రేమించమని బలవంతపెట్టేవాడు.2021 నవంబరు 3 న స్కూలు ముగించుకొని బస్ స్టాప్ వద్ద బస్‌ కోసం వేచి ఉన్న మైనర్ అమ్మాయిని షేక్ మహ్మద్ ఖయ్యూం బలవంతంగా తన బండి ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అనంతరం  ఒక పాడుబడ్డ ఇంట్లోకి లాక్కెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఎవరికైన చెబితే చంపేస్తానని బెదిరించి వదిలి పెట్టాడు. అయితే ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఖయ్యూం పై తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో  2021డిసెంబర్ 5న 366,376(2)(i),516(3),506IPC & Sec.3 R/W4 of POCSO Act 2012,sec 3(2)(v),3(2)(va) of SCs/STs(POA) Amendment Act 2025 సెక్షన్ల కింద కేసే నమోదు చేశారు.  మూడున్నర ఏండ్లు అనంతరం POCSO న్యాయస్థానం ఇన్చార్జి జడ్డి రోజా రమణి ఈరోజు తుది తీర్పు వెల్లడించారు. మొత్తం గా 51  సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. దానితో పాటు 85000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.7లక్షల కంపెన్సేషన్ ప్రకటించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఐ.వోలుగా జి వెంకటేశ్వర్ రెడ్డి, మట్టయ్య,కోర్ట్ పి.సి డి.కిరణ్ కుమార్(3209), ప్రస్తుత ఎస్.చ్.ఓ గా ఎన్ శంకర్ కీలకం గా వ్యవహరించారు.

ఇది కూడా చదవండి:అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్‌

Advertisment
తాజా కథనాలు