నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది విద్యార్థులు హాస్పిటల్‌లో చేరారు. మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది అస్వస్థకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు.. విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?
అలాగే మాగనూరు ప్రభుత్వ పాఠశాలను ఉమెన్ కమిషన్ సైతం తాజాగా పరిశీలించింది. వారం రోజుల వ్యవధిలోనూ 3సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడంతో కారణం ఏమై ఉంటుందా అని అంతా ఆందోళన చెందారు. ఆహారకల్తీనే అస్వస్థతకు కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదంటూ ఉమెన్ కమిషన్ స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరించింది. అయితే దీనికి గల కారణాలు బయటపడ్డాయి. ఫుడ్ పాయిజన్‌పై RTV గ్రౌండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. స్కూల్లో విద్యార్ధులు, సిబ్బంది అభిప్రాయాలను RTV తెలుసుకుంది.
Also Read: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్
అమ్మవారు వల్లే ఫుడ్ పాయిజన్
ఇందులో బాగంగానే వంటలు అన్నీ నాణ్యతతోనే చేస్తున్నాం అని వంట మనిషి తెలిపారు. అయితే పాఠశాలలో ఉండే తాయమ్మ అమ్మవారు వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని వంట మనిషి పేర్కొన్నారు. అమ్మవారికి పూజలు నిలిచిపోవడంతో పిల్లలకు ఇబ్బందులు పెడుతుందని అన్నారు. అన్నంలో పురుగులు వచ్చినప్పుడు అధికారులకు చెప్పాను అని తెలిపారు.
Also Read:ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!
విద్యార్థులు ఏమన్నారంటే?
ఆపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారి మాట్లాడుతూ.. ఈరోజు అందించిన ఆహారం బాగుందని విద్యార్ధులు అన్నారు. ప్రతిరోజు ఇలాంటి ఆహారమే పెట్టాలని తెలిపారు. నిన్న, మొన్న ఇలాంటి ఆహారం పెట్టలేదని పేర్కొన్నారు. ఇంకా స్కూల్ భోజనం మీద నమ్మకం రావడం లేదని వాపోయారు. తాగేనీళ్లు కలుషితంగా ఉంటున్నాయని ఆవేదన చెందారు. నీళ్ల ట్యాంక్ పైన మూత కూడా పెట్టడం లేదని తెలిపారు. అస్వస్థత అయ్యాక ట్యాంక్‌పై మూత పెట్టారని తెలిపారు.
Also Read: అఖిల్ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!
నీళ్లు వాసన వస్తున్నాయంటే బ్లీచింగ్ పౌడర్ చల్లి వాడేస్తారని.. కనీసం వాటర్ ట్యాంక్‌ను కూడా శుభ్రం చేయరని ఆవేదన చెందారు. వరుస ఘటనలతో ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నాం అని పేర్కొన్నారు. రేపటి నుంచి మళ్లీ పాత భోజనమే పెడతారేమో అని భయపడుతున్నారు. ఇటువంటి ఘటనలు జరగవనే గ్యారెంటీ లేదని చెప్పారు.