School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వరుసగా మూడు రోజులు సెలవులు

విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి.

New Update
Telangana and Andhra Pradesh School Holiday

school holidays alert 3 day break for students in telangana schools closed

వేసవి కాలం వచ్చేసింది. మార్చి నెలలోనే ఎండలు దంచేశాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల నడుస్తోంది. ఓ వైపు వానలు, మరోవైపు ఎండలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 24 నుంచే స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.  12, 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఎందుకు ఆ సెలవులు ప్రకటించారో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

వరుసగా మూడు రోజుల సెలవులు

ఏప్రిల్ 12వ తేదీన రెండో శనివారం. 
13వ తేదీన ఆదివారం 
14వ తేదీన అంటే సోమవారం అంబేద్కర్ జయంతి. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులకు వరుసగా 12, 13, 14 వ తేదీల్లో సెలవులు రానున్నాయి. అది మాత్రమే కాకుండా.. అంతకంటే ముందు ఏప్రిల్ 10న మహావీర్ జయంతి ఉంది. అది ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. అలాగే ఏప్రిల్ 18న మరో సెలవు వచ్చింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే కావడంతో స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ఉంటుంది.   దీంతో పాటు ఏప్రిల్ 30న బసవ జయంతి రోజు ఆప్షనల్ హాలీడేగా ప్రభుత్వం పేర్కొంది. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(ts-school-holidays | school-holidays | latest-telugu-news | telugu-news)

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు