చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ కొనసాగుతోంది. అల్లు అర్జున్ ను డీసీపీ సెంట్రల్ జోన్ నేతృతంలోని స్పెషల్ టీమ్ విచారిస్తోంది. సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్, ఎస్ఐ తదితరులు అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు. మొత్తం 50 ప్రశ్నలను అల్లు అర్జున్ ముందు ఉంచి సమాధానాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి 9:30 గంటల నుంచి బయటికి వెళ్లే వరకు ఏం జరిగింనే అంశంపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి:
అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ను అడుగుతున్న ప్రశ్నల వివరాలు ఇలా ఉన్నాయి..
1. పర్మిషన్ లేకపోయినా థియేటర్‌కు ఎందుకు వచ్చారు.?
2. రోడ్‌షో వద్దని చెప్పినా ఎందుకు నిర్వహించారు.?
3. మీరు థియేటర్‌కు వస్తున్న విషయాన్ని ముందుగానే ఫ్యాన్స్‌కు లీక్ చేశారా..?
4. ఏసీపీ ముందుగా వచ్చి వెళ్లిపోవాలని చెప్పారా..? లేదా..?
5. బయటకు వెళ్లిపోయేందుకు ఎందుకు నిరాకరించారు.?
6. డీసీపీ వచ్చి అరెస్టు చేస్తామనే వరకు ఎందుకు అక్కడే ఉండాల్సి వచ్చింది..?
7. పోలీసులు మీ దగ్గరికే రాలేదని అబద్ధం ఎందుకు చెప్పారు?
8. రేవతి చనిపోయిన విషయం చెప్పినా ఎందుకు తెలియదన్నారు?
9. తొక్కిసలాట జరిగిందని తెలిసినా మళ్లీ రోడ్ షో ఎందుకు చేశారు..?
10. పోలీసుల సెక్యూరిటీని ముందుగానే అడిగిన మీరు.. 50- 60 మంది బౌన్సర్లను ఎందుకు తెచ్చుకున్నారు..?
11. బౌన్సర్ల అత్యుత్యాహాన్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు..?
12. విచారణ జరుగుతుండగా ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టావు?
13. ఎవ్వరిదీ తప్పులేదని మీరెలా తేల్చారు..?
14.మీరు ఏ సమయానికి లోపలికి వచ్చారు?
15. ఎప్పుడు బయటకు వెళ్లారు?
వీటితో పాటు మొత్తం 50 ప్రశ్నలను అల్లు అర్జున్ ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ చెబుతున్న సమాధానం ఆధారంగా అప్పటికప్పుడు మరికొన్ని ప్రశ్నలను కూడా పోలీసులు సంధిస్తున్నట్లు సమాచారం.