Gutam Adani, Ponguleti Srinivas:
ఒకపక్క ఈడీ రెయిడ్స్‌తో గుక్క తిప్పుకోలేకపోతున్న మంత్రి శ్రీనివాస రెడ్డి..వాటి నుంచి తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. హైదరాబాద్ వ్యాపార వర్గాలు ఉలిక్కిపడేలా ఏకంగా అదానీతో చర్చలు చేస్తున్నారు పొంగులేటి. హైదరాబాద్ కోహినూర్ హోటల్‌లో గౌతమ్ అదానీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశం అయ్యారు. పొంగులేటి టేకోవర్ చేసిన IVRCL కంపెనీపై అదానీ ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మంత్రిపై ఈడీ రెయిడ్స్ ఒత్తిడి పెరగడంతో అదానీతో డీల్ కుదుర్చుకోవడానికి సరైన సమయం ఇదే అని మంత్రి భావిస్తున్నారు. ఈ కారణంగానే మంత్రి పొంగులేటి అదానీతో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ డీల్ కుదురుతుందా లేదా అని చర్చలకు దారి తీస్తోంది.
Also Read: Hyderabad: రాక్షసిలా మాట్లాడుతున్నారు..సురేఖపై అమల ఆగ్రహం
 Follow Us