Rythu Bharosa: తెలంగాణ రైతులకు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్

TG: రేవంత్ సర్కార్ రైతులను అయోమయంలోకి నెట్టింది. యాసంగి పంట రైతు భరోసాను సంక్రాంతికి ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశరరావు అన్నారు. కాగా వానాకాలం ఇవ్వని రైతు భరోసా డబ్బులు ఇక ఇవ్వరా? అనే చర్చ జోరందుకుంది.

New Update
PM Kisan Update : రైతులకు అలెర్ట్.. పీఎం కిసాన్‌ 17వ నిధుల విడుదలపై కీలక్‌ అప్‌డేట్‌!

Rythu Bharosa: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ తో పాటు ఓ బ్యాడ్ న్యూస్ ను కూడా చెప్పింది. రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ కానుకగా రైతుల ఖాతాలో యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 అందించనున్నట్లు ప్రకటించారు. కాగా ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 లను పెట్టుబడి సాయం కింద అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

వానాకాలం రైతు భరోసా లేనట్టే..?

 యాసంగి పంటకు రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల ప్రకటన రైతులను అయోమయంలోకి నెట్టింది. యాసంగి పంటకు ఇస్తామని చెప్పడంతో వానాకాలం రైతు భరోసా లేనట్టేనా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. వానాకాలంలో రేవంత్ సర్కార్ రైతు భరోసా నిధులను ఇవ్వలేదు. అదే సమయంలో రుణమాఫీ అంశాన్ని తెరపైకి తెచ్చి రూ.2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసింది. కాగా ఆరోజు రైతు భరోసా రాకపోవడంతో వానాకాలం, యాసంగి పంటకు సంబంధించిన రెండు పంటల రైతు భరోసా నిధులను డిసెంబర్ నెలలో విడుదల చేస్తారంటూ ప్రచారం జరిగింది. మరి వానాకాలం, యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బును రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.  

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!

5 ఎకరాల లోపే రైతు భరోసా?

ఇదిలా ఉంటే..  రైతు భరోసా ఎన్ని ఎకరాల్లోపు ఉన్నవారికి వస్తుందనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఐదెకరాల్లోపే ఉన్నవారికి రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే.. రాళ్ళూ రప్పలు, గుట్టలు ఉన్నవారికి రైతు బంధు ఇవ్వకుండా.. కేవలం పంట సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా డిసెంబర్ నెలల్లో జరిగే కేబినెట్ భేటీలో మంత్రి వర్గం రైతు భరోసాపై చర్చించి, అధికారుల ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసి.. రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

Also Read: సర్కార్ స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్.. అక్కడి నుంచే స్టార్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు