Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శల దాడికి దిగారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ కు క్యాడర్ లేదని.. BRS కు ఉన్న లీడర్ ఫార్మ్ హౌస్ లోనే ఉన్నారని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి... బీజేపీ చేసిన ఉద్యమాల కారణంగా సిఎం అయ్యారని అన్నారు. రేవంత్ రెడ్డి మీద ఉద్యమాలలో పాల్గొన్న కేసులు లేవు.. ఉన్నది రేవంత్ రెడ్డిపై కేసు ఓటుకు నోటు కేసు అని సెటైర్లు వేశారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఆ గ్రామాలకు జిల్లాలు మార్పు!
రేవంత్ రెడ్డికి డెడ్ లైన్...
రేవంత్ రెడ్డి భాష విషయంలో కేసీఆర్ కి తాత అయ్యారని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసింది వాస్తవం కాదా అని సీఎంను నిలదీశారు. రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన డబ్బులు ఏమయ్యాయి?, రైతు భరోసా ఎక్కడ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి సంక్రాంతి డెడ్ లైన్ అని అన్నారు. సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ నేతను రోడ్లపై తిరగనివ్వం అని హెచ్చరించారు. ఆసరా పింఛన్లు, స్కూటీ లు, మహిళలకు ఇస్తామని చెప్పిన రూ. 2500 ఎప్పుడు ఇస్తారు? అని నిలదీశారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ కు ఆహ్వానం అందించిన మంత్రి పొన్నం..!
రేవంత్ నోరు తెరిస్తే అబద్ధాలే అని అన్నారు. 20 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి.. 55 వేల మంది ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారనిం ఫైర్ అయ్యారు. కొత్త కొత్త జీవోలు తెచ్చి నిరుద్యోగులను రేవంత్ మోసం చేస్తున్నారని అన్నారు. 317 జీవో గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు DA లు లేవు, ప్రమోషన్లూ లేవని మండిపడ్డారు. బీసీ సబ్ ప్లాన్ అమలు ఏమైంది?, బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. MIM మద్దతు కూడగట్టుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ఇదెక్కడి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా!
ఇది కూడా చదవండి: రహాదారిపై కాంగ్రెస్ ఎంపీ అత్యుత్సాహం.. వాహనాలను ఆపి..!