రహాదారిపై కాంగ్రెస్ ఎంపీ అత్యుత్సాహం.. వాహనాలను ఆపి..!

హైదరాబాద్ హయత్ నగర్ లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లి కాన్వాయ్ హైవేపై నిలిపివేశారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా జనాలు ఇబ్బందిపడ్డారు.

author-image
By srinivas
New Update
ఇఆఇఇ

Hyderabad: హైదరాబాద్ హయత్ నగర్ రహాదారిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయవాడకు వెళ్లే రూట్ ల్ తమ కాన్వాయ్ రోడ్డుమీదే నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా అంబులెన్స్ అందులోనే ఇరుక్కుపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక ఆయనను చూసేందుకు జనాలు తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ అనుచరులు సైతం హల్ చల్ చేశారు. ప్రశ్నించిన వారిని బెదిరింపులకు పాల్పడ్డట్లు స్థానికులు వాపోయారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు