Harish Rao Father : రేవంత్, కేసీఆర్ సంతాపం.. కాసేపట్లో హరీష్ ఇంటికి కేసీఆర్‌

హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ప్రార్థించారు.

New Update
Harish Rao Father: Revanth, KCR condole.. KTR, KCR visit Harish's house

Revanth, KCR condole.. KTR, KCR visit Harish's house

Harish Rao Father : మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూశారు.  ప్రస్తుతం హైదరాబాద్ కోకాపేట క్రిన్స్‌విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివదేహం ఉంది. హరీష్ రావు నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకుంటున్నారు.మధ్యాహ్నం ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

కాగా,  హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావు కు ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికాసేపట్లో వారి నివాసానికి వెళ్లి, దివంగత సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, తన సోదరిని, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థింస్తున్నట్లు పేర్కొన్నారు. హరీష్ రావు కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


ఈ మేరకు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవిత ఇద్దరూ సోషల్ మీడియా వేదికల ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ తన ఎక్స్ పోస్ట్‌లో "హరీశ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలి" అని రాశారు. అలానే కవిత తన పోస్ట్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

మరోవైపు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు, కాంగ్రెస్, బీజేపీ, బీసీ సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు కూడా హరీశ్‌రావు ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రసాద్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పూలమాలలు అర్పించి నివాళులు తెలిపారు. కోకాపేట్ హరీష్‌రావు నివాసం వద్ద రోడ్లపై పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నాం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు