/rtv/media/media_files/2025/02/21/X2cBjqbrfK9BlzQuxXfC.jpg)
DG Anjani Kumar
తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోం శాఖ. డీజీ అంజనీ కుమార్ పై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆయనను వెంటనే రిలీవ్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఏఫైర్స్ అదేశాలు ఇచ్చింది. అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. తెలంగాణ మాజీ డీజీపీ గా ఈయన పనిచేశారు. ఇక అంజనీ కుమార్ తో పాటూ టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష గుప్తా, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ వెంటనే ఏపీ క్యాడర్ లో రిపోర్ట్ చేయాలని చెప్పింది.
రాష్ట్ర విభజన సమయంలో..
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీకి కేటాయించబడ్డారు. అయితే, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తెలంగాణలోనే కొనసాగుతున్నారు వీరందరూ. ప్రస్తుతం డీజీ ర్యాంకులో కొనసాగుతోన్న అంజనీకుమార్.. రోడ్ సేఫ్టీ డీజీగా ఉండగా.. డీజీ ర్యాంక్‌లో ఉన్న మరో ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్తా.. పోలీస్ ట్రైనింగ్ డీజీగా ఉన్నారు. ఇక అభిషేక్ మహంతి ఎస్పీ ర్యాంకులో ఉన్నారు. అయితే, అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించి కేంద్ర హోంశాఖ.. వెంటనే ఏపీ క్యాడర్ లో రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ముందు కూడా ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారులను ఏపీ కి పంపించింది హోంశాఖ. ఐఏఎస్ అధికారులు అమ్రాపాలి, వాణీ ప్రసాద్, వాకాటి కారుణ, రొనాల్డ్ రాస్, ప్రశాంతిలు తెలంగాణను వదిలి వెళ్ళి ఏపీలో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ లను ఈ విధంగా రిలీవ్ చేయాలని చెప్పింది హోంశాఖ.
Also Read: Rome: మరణానికి మందే శవపేటిక, సమాధి రెండూ సిద్ధం...ఎవరికో తెలుసా..