TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !

మణుగూరు ప్యాసింజర్‌ రైలులో రమణమ్మను హరియాణకు చెందిన రోహిత్‌ అనే వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. హత్య చేసి పర్సులో రూ. 25 వేలు నగదు, రైలు టికెట్‌, ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు.

crime,

TG crime

New Update

TG crime: మణుగూరు రైలులో మహిళ దారుణ హత్య జరిగింది. కూతురును చూసేందుకు మణుగూరు ప్యాసింజర్‌ రైలులో ప్రయాణం చేస్తున్న మహిళ రైల్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దివ్యాంగుల బోగీలోని బాత్‌రూంలో మెడ చుట్టూ తువ్వాలు బిగించి ఊపిరాడకుండా చేసి ఓ దుండగుడు చంపాడు. ఈ ఘటనపై విచారణ చేసిన పోలీసులు నిందితులు గుర్తించి పట్టుకున్నారు. అయితే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు అత్యాచారం చేసి, చంపేసి.. మృతదేహంపై ఉన్న విలువైన వస్తువులు తీసుకుని పరారవుతాడని పోలీసుల విరాచణలో తేలింది. మృతురాలి రమణమ్మకు భర్త గోవిందప్ప ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. బతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితమే కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సింపోటు మండలం తోర్నగల్‌లో రమణమ్మ కుటుంబం స్థిరపడింది. పెద్ద కుమార్తె హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఉంటోంది. 

బాత్‌రూం డోర్‌ తీసి చూడగా రమణమ్మ మృతదేహం:

కూతురుని చూసేందుకు రమణమ్మను నవంబర్‌ 23న రాత్రి 7 గంటలకు బయల్దేరింది. బళ్ళారి దగ్గర తోర్నగల్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర మణుగూరు ప్యాసింజర్‌ రైల్లోని మహిళల బోగీలోకి కొడుకు ఎక్కించాడు. వెంటనే హైదరాబాద్‌లో ఉంటున్న బావ వెంకటేశ్‌కు ఫోన్‌ చేసి సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆమెను రిసీవ్‌ చేసుకోవాలని చెప్పాడు. నవంబర్‌ 24 ఆదివారం ఉదయం ఆ రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే అప్పటికే అల్లుడు వెంకటేష్‌ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చుస్తూ ఉన్నాడు. రైలు వెనుక భాగంలో ఉన్న మహిళల బోగిలో అత్త కోసం చూడగా కనిపించలేదు. దీంతో పక్కనే దివ్యాంగుల బోగిలో బాత్‌రూం డోర్‌ తీసి చూడగా అత్త రమణమ్మ మృతదేహం కనిపించింది. వెంటనే వెంకటేష్‌ లోకో పైలట్‌కు, సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాడు. ప్రమాదంపై స్పందించిన రైల్వే పోలీసులు మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు. 

Also Read: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

ఒంటరి మహిళలను లక్ష్యంగా..

రమణమ్మను హరియాణకు చెందిన రోహిత్‌ అనే వ్యక్తి హత్య చేసినట్లు తెలిసింది. హత్య జరిగిన వెంటనే నిందితుడు బళ్ళారి నుంచి సికింద్రాబాద్‌ మధ్యలో తిరిగి పలు రైళ్లు మారి గుజరాత్‌కి పారిపోయ్యాడు. గుజరాత్‌ రైల్వే పోలీసులు తనిఖీల్లో బాగంగా అనుమానాస్పద స్థితిలో నిందితుడు తిరుగుతుండగా పట్టుకుని స్టేషన్‌ తీసుకేళ్లారు. అక్కడ పూర్తిస్థాయిలో విచారించగా హతకుడు అతడేనని తేలింది. అంతేకాకుండా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని హత్య చేయటంతోపాటు రేప్‌చేసి హత్య చేసినట్లు విచారణలో రోహిత్‌ అంగీకరించాడు. ఇప్పటిదాకా కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ ప్రాంతాల్లో ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. హత్య చేసిన రమణమ్మ మెడలో బంగారాన్ని దొంగ ముట్టుకులేదు కానీ ఆమె పర్సులో ఉన్న 25 వేలు నగదుతోపాటు.. బళ్ళారి నుంచి సికింద్రాబాద్‌ రైలు టికెట్‌, ఫోన్‌ను తీసుకున్నాడు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

Also Read: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు మూడు చోట్ల..

Also Read: పాపం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు వైద్యులు మృతి!

#train #crime #rape-attempt #manuguru
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe