/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)
Rain alert for Telangana
Rain alert for Telangana : తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలటం లేదు. రానున్న కొద్ది గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇప్పటికే కొద్ది రోజులనుంచి వరుస వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఇదిలా ఉండగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ ,నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈ రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. అదే విధంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు గా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు
ఇక రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. రేపు (బుధవారం) బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అక్టోబర్ 2న పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది అక్టోబర్ 3న ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీ రాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇది కూడా చూడండి: Raipur Steel Plant Collapses: కుప్పకూలిన స్టీల్ ప్లాంట్.. ఐదుగురు కార్మికుల దుర్మరణం!
ఇదిలా ఉండగా రానున్న కొద్ది గంటల్లో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని.. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంగి ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో అల్ప పీడనం 2న పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య, దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: అక్టోబర్ 1 లేదా 2.. నవరాత్రి ఉపవాసం ముగించడానికి సరైన రోజు ఏదో తెలుసా?