Rahul Gandhi : శభాష్ రేవంత్.. అంచనాలకు మించి చేశావ్ ..పొగిడిన రాహుల్‌ గాంధీ

కులగణన నిర్వహించడం అంత తేలిక కాదన్నారు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారని, విజయవంతంగా సర్వే చేపట్టారని కొనియాడారు.  

New Update
rahul-gandhi

కులగణన నిర్వహించడం అంత తేలికైన విషయం కాదన్నారు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారని, విజయవంతంగా సర్వే చేపట్టారని కొనియాడారు.  కులగణనపై న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని కొనియాడారు.  ఇది మార్గదర్శిగా నిలుస్తుందన్నారు రాహుల్. రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేయాల్సిన అవసరం ఉందని చెప్పారు రాహుల్. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ నొక్కి చెప్పారు. 

 బీసీలపై నిజమైన ప్రేమ లేదు 

ప్రధాని మోదీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి . కొన్ని విషయాల్లో మోదీ సర్కార్‌ దిగి వచ్చేలా రాహుల్‌ గాంధీ పోరాటం చేశారని అన్నారు. రాహుల్‌ గాంధీ పోరాటం వల్లే కులగణన చేసేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పుకొచ్చారు.  తెలంగాణలో జరిగిన సమగ్ర సర్వే డేటా 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైందని తెలిపారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల, రాజకీయ సర్వే సమగ్రంగా జరిగిందని తెలిపారు.  

భారత్‌ జోడో యాత్రలో ప్రజల కోరికలను రాహుల్‌ తెలుసుకుని ప్రజలకు రాహుల్‌ కులగణనపై హామీఇచ్చారని తెలిపారు  దేశానికి ఒక దిశను చూపించే విధంగా కులగణన చేపట్టామన్నారు రేవంత్. దాదాపు వందేళ్ల తర్వాత కులగణన ప్రక్రియ చేపట్టడం జరిగిందని తెలిపారు. అగ్రవర్ణాలను కూర్చోబెట్టి మాట్లాడామని, అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పామని తెలిపారు.  కాంగ్రెస్‌ ఉంటేనే అన్నీ ఉంటాయని చెప్పుకొచ్చారు.  

సోనియా గాంధీ తనను మెచ్చుకుంటూ లేఖ రాసిందన్నారు సీఎం రేవంత్.  ఇది నాకు ఆస్కార్ అవార్డ్, నోబెల్ బహుమతి, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అని అభిప్రాయపడ్డారు.  

Also Read :   BIG BREAKING : తెలంగాణలో స్థానిక ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. ఇప్పట్లో లేనట్టే!?

Advertisment
తాజా కథనాలు