Family Survey : నేడు సబ్ కమిటీకి కుటుంబ సర్వే నివేదిక..నివేదికలో ఏముందంటే....
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తుది నివేదికను ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని నిర్వహించింది.