/rtv/media/media_files/2025/01/30/LMGSAQXwlK2dQl4Xykvr.jpg)
ts high court Photograph: (ts high court)
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీరాధాకిషన్‌రావు, మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావులకు బెయిల్ మంజూరు అయింది. తెలంగాణ హైకోర్టు వీరికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ. లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని, ట్రయల్కి పూర్తిగా సహకరించాలని, పాస్ పోర్టు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని ఇద్దరినీ ఆదేశించింది.
వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం గత ఆగస్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. అప్పటి నుంచి ఆ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. దీంతో తనకు రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఇదే కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మారగానే ట్యాపింగ్ చేసిన పరికరాలన్నీ ధ్వంసం చేశారని గుర్తించి కేసులు పెట్టారు. సుమారు ఏడాది కాలం పాటుగా నడుస్తోన్న ఈ కేసు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ఈ కేసులో ఏ వన్ గా ఉన్నఇంటలిజెన్స్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. కేసు నమోదు కాక ముందే వైద్య చికిత్స కోసం వెళ్లిపోయిన ఆయన ఇప్పటి వరకూ తిరిగి రాలేదు. ఆయన కోసం పోలీసులు చాలా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది.