తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్‌లో ఈ ప్రశ్నలేంటి.. అభ్యర్థుల ఆగ్రహం

TS గ్రూప్ 2 పరీక్షలో TDP, చంద్రబాబు గురించి ప్రశ్నలు రావడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం పేపర్‌లో 3 ప్రశ్నలు సమైక్యాంధ్రా నాయకుల గురించి వచ్చాయని మండిపడ్డుతున్నారు. మలిదశ ఉద్యమంలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయని అభ్యర్థులు ఊహించలేదంటున్నారు.

author-image
By K Mohan
New Update
45256633

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 ఎగ్జామ్‌లో డీటీపీ, చంద్రబాబుపై ప్రశ్నలు వచ్చాయి. డిసెంబర్ 16న నాలుగొవ పేపర్ తెలంగాణ ఉద్యమం పరీక్ష జరిగింది. గ్రూప్ 2లో చివరి పేపర్ అయిన తెలంగాణ మూమెంట్‌లో ఏకంగా మూడు ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్, టీడీపీ, చంద్రబాబు గురించి వచ్చాయని అభ్యర్థులు అవాక్కయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు ఆశ్చర్య పోయారు. ఇలాంటి ప్రశ్నలు ఉద్యమ చరిత్ర పేపర్ లో  వస్తాయని అభ్యర్థులు అస్సలు ఊహించలేదని అంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ సర్కార్ నాశనం చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. 

ఇదికూడా చదవండి: జీవితంలో ఈ విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి

ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు పాలనపై పలు ప్రశ్నలు రావడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇది తెలంగాణ ఉద్యమం పేపరా? టీడీపీ పేపరా? అని సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది టీజీపీఎస్సీనా? టీడీపీ ఎస్సీ పేపరా, ఇది తెలంగాణ ప్రభుత్వమా? తెలుగుదేశం ప్రభుత్వమా అని ప్రశ్నిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా

2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా? కాదా?
రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బరామి రెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా కాదా?? అని మూడు ప్రశ్నల్లో స్టేట్‌మెంట్ల రూపంలో క్వశ్చన్స్ వచ్చాయని హరీశ్ రావు ట్విట్ చేశారు. గ్రూప్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలను చూస్తే, టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీ పరీక్షనా అనే అనుమానం వస్తుందని ఆయన అన్నారు. మలి తెలంగాణ ఉద్యమ ఉనికి లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ నేత వివరించారు.

ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే?.. తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు హరీశ్ రావు. చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకమని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే నీ కుటిల యత్నాలను యావత్ తెలంగాణ సమాజం గుర్తించింది. త్వరలోనే తగిన బుద్ధి చెబుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు