రేవంత్‌ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే?

మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సర్కార్‌ దూకుడు పెంచింది. సియోల్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర బృందంలో మంత్రి పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మూసీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆయన కంపెనీకి అప్పగించే అవకాశముంది.

ponguleti srinivas reddy

Ponguleti Srinivas Reddy

New Update

Hyderabad: ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో మూసీ ఒకటి. ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేయాలనుకుంటోంది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఆక్రమణలతో అన్యాక్రాంతమైపోయిన ఈ నదికి పునరుజ్జీవం కల్పించాలనుకుంటోంది. లండన్‌లోని థేమ్స్ నది, సియోల్‌లోని చియోంగ్‌ జియోన్ నది లాగా దీన్ని సుందరీకరించాలనుకుంటోంది.  తెలంగాణలో మూసీ నదికి ఘన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ నది పేరు కూడా ఎత్తలేని పరిస్థితి వచ్చింది. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి.. ఇలా చెప్పుకుంటూపోతే దేశంలో ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. వీటిని ఎంతో ఆరాధిస్తారు ప్రజలు. కానీ మూసీ అనగానే మురికికూపం మాత్రమే గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడు మూసీ పునరుజ్జీవం పేరుతో రేవంత్‌ ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తుంది.  సియోల్‌లోని చియోంగ్ జియోన్ నది కూడా 2003 వరకూ మూసీలాగే ఉండేది. ఆ తర్వాత దాన్ని ప్రక్షాళించారు. ఇప్పుడు ఆ నది అందాలు చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఏటా 2 కోట్ల మంది పర్యాటకులు ఈ నదిని సందర్శిస్తున్నట్టు అంచనా. చియోంగ్ జియోన్ నదిని ప్రక్షాళించిన తర్వాత పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. జీవవైవిధ్యం పెరిగింది. మూసీని కూడా ఇలా ప్రక్షాళించి సుందరంగా తీర్చిదిద్దాలని.. నదికి పునరుజ్జీవం కల్పించాలనేది తెలంగాణ సీఎం ఆలోచన. ఈ ప్రాజెక్టు కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించింది. 

మంత్రి కంపెనీకే ప్రాజెక్టు..

అయితే మూసీ పునరుజ్జీవం కోసం ప్రభుత్వం కొన్ని కాంట్రాక్టు సంస్థలకు అప్పగించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టును రాష్ర్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘన కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. దీనికి కారణం సోమవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటించింది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్‌చూ నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం సియోల్‌లో యాన్, చీయంగ్‌చూ నదుల అభివృద్ధి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సియోల్‌లో మంత్రులు, అధికారులు పర్యటిస్తున్నారు. బృందంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, నగర మేయర్, ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ, మూసీ రివర్ ప్రంట్ అధికారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి:  హనీ ట్రాప్‌ వెనుక వైసీపీ నేతలు..? వెలుగులోకి సంచలన విషయాలు


కాగా పొన్నం హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉండడంవల్ల ఆయన బృందంలో ఉండటంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ హైదరాబాద్‌కు కానీ, మంత్రిత్వ శాఖ పరంగానూ ఎలాంటి సంబంధం లేని పొంగులేటి ఈ బృందంలో ఉండటం ఏమిటని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొంగులేటికి చెందిన రాఘన కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగిస్తారని అందుకే ఆయన అక్కడి నదిని ప్రక్షాళన చేసిన తీరును పరిశీలించడానికే అక్కడికి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ అదే నిజమైతే పొంగులేటి సంస్థకు మూసీనదిని ప్రక్షాళన చేసే సామర్ధ్యం ఉందా? అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నకిలీ బ్యాంక్‌ గ్యారంటీలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారనే ఆరోపణలు కూడా ఆ నిర్మాణ సంస్థపై ఉన్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టు ఆయన చేతికి వస్తుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.

 

ఇది కూడా చదవండి:  హిందూ దేవాలయాలపై దాడి... 'హైదరాబాద్‌లో ఉగ్రవాదులు'

 

 

ఇది కూడా చదవండి:  ఆరోగ్యకరమైన స్నాక్స్‌.. ఆకలి అస్సలు ఉండదు

 

 

ఇది కూడా చదవండి:  ఫ్యాట్‌ మొత్తం కరిగించే అద్భుతమైన పండ్లు ఇవే

 

#ponguleti-srinivas-reddy #hyderabad musi river
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe