Ayodhya: 500 ఏళ్ల తరువాత అక్కడ దీపావళి సంబరాలు

500 సంవత్సరాల తరువాత అయోధ్యలో నేడు రాముడి దీపావళి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. కొత్త ఆలయంలో రామ్ లాలా ప్రతిష్ఠాపన తర్వాత ఇది తొలి దీపావళి.

New Update
Ayodhya News : 14 లక్షల దీపాలతో రాముడి ఫొటో.. వీడియో వైరల్‌!

Ayodhya: 500 సంవత్సరాల తరువాత అయోధ్యలో నేడు రాముడి దీపావళి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. కొత్త ఆలయంలో రామ్ లాలా ప్రతిష్ఠాపన తర్వాత ఇది తొలి దీపావళి. ఈ సారి దీపావళి వేడుకలకు సన్నాహాలు కూడా ఘనంగా జరిగాయి. ఈరోజు దీపాల పండుగ మొదలుకొని పుష్పక విమానంలో స్వామి వచ్చేంత వరకు అనేక కార్యక్రమాలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read:  ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వానలు

ఇక ఈ కార్యక్రమాలకు అయోధ్య రోడ్లు సిద్ధమయ్యాయి. నగరంలోని వీధులు, కూడళ్ల నుంచి సరయూ నది ఘాట్‌ల వరకు కూడా లైట్లతో కళకళలాడుతున్నాయి నేడు ఈ ఘాట్‌ లను 28 లక్షల దీపాలతో వెలిగించి వరుసగా ఏడోసారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో తమ పేరు నమోదు చేసుకోనున్నారు. పర్యాటక శాఖ అయోధ్యను అలంకరించి సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతలను ఏజెన్సీలకు ఇచ్చింది. 

Also Read: నాపై డ్రగ్స్‌ కుట్ర చేశారు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు

600 అడుగుల ఎత్తులో...

ఈసారి అయోధ్యలో కాలుష్య రహిత హరిత బాణసంచా  కాల్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా అయోధ్య బాణాసంచా 120 నుంచి 600 అడుగుల ఎత్తులో ఆకాశంలో వెదజల్లుతుంది. ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని సులభంగా చూడగలుగుతారు. సాయంత్రం సరయూ బ్రిడ్జ్‌పై బాణసంచా కాల్చడమే కాకుండా లేజర్ షో, ఫ్లేమ్ షో, మ్యూజికల్ కంపానిమెంట్ కూడా ఉండనుంది. 

Also Read:  ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు

రామకథా పార్కు సమీపంలోని హెలిప్యాడ్ వద్ద భారత్ మిలాప్ కార్యక్రమం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. రాముడు, సీత, లక్ష్మణుడు పుష్పక విమానంతో  ఇక్కడికి రానున్నారు. వారికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలుకుతారు. రామకథా పార్కులో శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో సరయూ నది ఒడ్డున 1,100 మంది ప్రత్యేక ‘ఆరతి’ ఇవ్వనున్నారు.

Also Read:  మీ అంతు చూస్తా.. ఏసీపీ, ఎస్‌పై రెచ్చిపోయిన రఘునందన్‌ రావు

రామ్ కి పైడి, భజన సంధ్యా స్థల్, చౌదరి చరణ్ సింగ్ ఘాట్ల  వద్ద 28 లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. వీటిలో 25 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించాలని అనుకుంటున్నారు. ఇక్కడ మంగళవారం సాయంత్రం వరకు 55 ఘాట్లలో దీపాల లెక్కింపు కొనసాగింది. 

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కన్సల్టెంట్ నిశ్చల్ బరోట్ నేతృత్వంలోని 30 మంది సభ్యుల బృందం డ్రోన్‌లను ఉపయోగించి సరయూలోని 55 ఘాట్‌లలో దీపాలను లెక్కించారు. 10 శాతం దీపాలు చెడిపోయినా రూ.25 లక్షల లక్ష్యాన్ని చేరుకునేలా స్థానిక కళాకారులకు 28 లక్షల దీపాల ఆర్డర్‌ ఇచ్చారు. చాలా చోట్ల, కొన్ని ప్రత్యేక నమూనాలలో దీపాలను ఏర్పాటు చేశారు. ఘాట్ నంబర్ 10ని 80,000 దీపాలతో స్వస్తిక ఆకారంలో తీర్చిదిద్దారు. ఇది శుభానికి చిహ్నం. ఇదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు