/rtv/media/media_files/2025/03/05/Xdu7C3nl9xQk0goDuBXW.jpg)
prabhakar rao, sravan rao Photograph: (prabhakar rao, sravan rao)
రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను సంచలనం రేపింది. ఆ వ్యవహారం ఇప్పుడు కాస్త ముందుకు వెళ్ళింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రవణ్ రావును సిట్ అధికారులు 11 గంటల పాటు విచారించారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు విచారణ కొనసాగింది. ఇందులో పలువురు ప్రముఖుల పేర్లు శ్రవణ్ రావు చెప్పారని తెలుస్తోంది. మరోవైపు అతని దగ్గర నుంచి రెండు ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. వాటిలో ఉన్న కాల్ లాగ్స్, మెసేజ్ లు, వాట్సాప్ చాట్స్ లను కూడా పరిశీలించనున్నారు. దాని ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కోసం ఎవరెవరి నంబర్లు ఇచ్చారనేది శ్రవణ్ ను సిట్ అధికారులు విచారణలో కనుగొన్నారు. దాని ప్రకారం ఈ కేసులో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.
పూర్తి విచారణ..
ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా పలువురు రాజకీయ నేతలపై సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు సేకరించి పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆ నివేదికలు ఎవరి ఆదేశాలతో పంపించబడ్డాయో తెలుసుకునేందుకు సెట్ కృషి చేస్తోంది. అంతేకాదు శ్రవణ్ రావు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఉద్యోగులతో సంబంధాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా అధికారులు శ్రవణ్ రావును విచారించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో శ్రవణ్ రావు మీడియేటర్ గా వ్యవహరించినట్టు విచారణలో తెలిసింది. కొంత మంది కీలక రారజకీయ నాయకులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడితో శ్రవణ్ రావు విచారణ ముగియలేదని...మరో మూడు రోజుల్లో మళ్ళీ పిలిచే అవకాశం ఉందని సెట్ అధికారులు చెబుతున్నారు. తుది నివేదిక సిద్ధమయ్యే వరకు మరికొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.
today-latest-news-in-telugu | phone-tapping | sit
Also Read: chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం