''రాజకీయాలను వదిలేద్దామనుకున్నా''.. ఎక్స్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన కేటీఆర్‌..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం 'ఆస్క్ కేటీఆర్‌' పేరిట నెటిజన్లతో ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన ఎలాంటి సమాధానాలు ఇచ్చారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
KTR

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఆక్స్‌ కేటీఆర్‌ పేరిట నెటిజన్లతో ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగాలేవని అన్నారు. 2025 తర్వాత కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారు. బాధ్యత గల విపక్ష నేతగా ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నారు. పదేళ్ల పాటు అధికారంలోకి ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి కారణంగానే ఓడిపోయాం. జిల్లాల్లో ఉండే ప్రజలు కాంగ్రెస్ చేసిన అబద్దపు హామీలు నమ్మి ఓటు వేశారు. 

Also Read: అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్.. 100 మంది పోలీసులతో!

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీని ఇచ్చిన హామీలన్నీ వదిలే వరకు వదిలిపెట్టం. ప్రజలకు వారిని జవాబుదారితనంగా ఉండేలా చేస్తాం. ప్రస్తుత రాజకీయాల్లో కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదు. రాజకీయాల్లో వాళ్లని ఎందుకు లాగుతున్నారో కూడా అర్థం కావడం లేదు. 

మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేదు. నా 18 ఏళ్ల ప్రజా జీవితంలో నా కుటుంబ సభ్యులు, పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక దశలో రాజకీయాల నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాను. కానీ ప్రజలు కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న వద్దన్నా ప్రజా జీవితంలోకి వచ్చానని'' కేటీఆర్‌ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  

Also Read: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్‌ బిగ్ ప్లాన్!

 Also read: ఒక్క అంగుళం కూడా వదులుకోం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు