ఒక్క అంగుళం కూడా వదులుకోం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ సైనికులతో వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా భారత్ రాజీపడబోదని తేల్చిచెప్పారు.

New Update
Modi in gujrat

దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ సైనికులతో వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా భారత్ రాజీపడబోదని చెప్పారు.  '' భారత్‌ తన శత్రువుల మాటలను కాదు.. సైనికులు దృఢ నిశ్చయాన్ని విశ్వసిస్తోంది. దేశాన్ని రక్షించే సైనిక శక్తిపై ప్రజలు అమిత విశ్వాసంతో ఉన్నారు. సైనికుల వల్లే దేశం సురక్షితంగా ఉందని భావిస్తున్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. 

Also Read: TCS ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఇక 15 ఏళ్ల పాటు నో టెన్షన్!

అదే తొలి ప్రాధాన్యం

ఈ కలలకు సైనికులే రక్షకులుగా ఉన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే తమ తొలి ప్రాధాన్యం. ఆర్మీ నేవి, ఎయిర్‌ఫోర్స్‌ వేరువేరుగా ఉన్నప్పటికీ.. త్రివిధ దళాలు ఒక్కచోట చేరితే మన శక్తి సామర్థ్యాలు ఎంతో పెరుగుతాయని'' ప్రధాని మోదీ అన్నారు. 'ప్రపంచం నిన్ను చూసినప్పుడు.. భారత బలాన్ని చూస్తుంది. కానీ శత్రువులు నిన్ను చూసినప్పుడు వారు తమ దుష్ట పన్నాగాల అంతాన్ని చూస్తారు' అంటూ వ్యాఖ్యానించారు. 

ఈ ఏడాది కూడా ఆయన సైనికులతో కలిసే వేడుకలు జరుపుకున్నారు. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం(BSF), ఆర్మీ, నేవి, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. కచ్‌లోని సర్‌ క్రీక్‌ ప్రాంతంలో లక్కీ నాలకు ప్రధాని బోటులో వెళ్లారు. ఎప్పట్లాగే సైనిక దుస్తుల్లోనే అక్కడికి చేరుకున్నారు. భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. 

Also Read: యుద్ధం చేస్తే శవాలే మిగులుతాయి..ఉత్తర కొరియాకు అమెరికా హెచ్చరిక

2014లో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ ప్రతీ ఏడాది సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. సైనిక దళాలలతో ముచ్చటిస్తూ వారికి స్వీట్లు తినిపించి వాళ్ల సేవలను కొనియాడుతూ మరింత స్పూర్తిని నింపుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు