అత్యంత విశ్వాసం గల జంతువులలో డాగ్స్ ముందు వరుసలో ఉంటాయి. అందువల్లనే డాగ్స్ అంటే చాలా మందికి ఇష్టం. వాటితోనే రోజంతా గడిపేస్తుంటారు. ఎక్కడకి వెళ్లినా వాటిని వెంటపెట్టుకుని తీసుకుపోతుంటారు. అంతేకాకుండా వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చిన్న గాయం అయినా యజమానులు తట్టుకోలేరు.
Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?
మరికొందరు ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు దాని బాగుబాగోగులు చూసుకుంటారు. ఉదయం లేవగానే బయటకు తీసుకెళ్లి మలవిసర్జన వంటివి చెయ్యిస్తారు. అయితే ఇకపై అలా చేయిస్తే తగిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.
Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా
మలవిసర్జన చేయిస్తే జేబుకు చిల్లు
శునకాన్ని ఇంటి బయటకు తీసుకెళ్లి మలవిసర్జన చేయిస్తే జేబుకు చిల్లు పడ్డట్లే! అని చెబుతున్నారు. పెంపుడు శునకాన్ని బయటకు తీసుకొచ్చి వదిలేస్తే.. అదే సమయంలో అవి బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేస్తే.. మున్సిపల్ సిబ్బంది విధించే భారీ జరిమానా కట్టాల్సిందే. మున్సిపల్ చట్టంలో ఉన్న ఈ నిబంధనను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో కఠినంగా అమలు చేయనున్నారు.
Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
ఇందులో భాగంగానే మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టికె శ్రీదేవి జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్లకు సైతం సమాచారం అందించారు. ఇప్పటికే ఈ నిబంధన జీహెచ్ఎంసీ పరిధిలో అమలులో ఉంది.
Also Read: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్
తాజాగా మున్సిపల్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ఉద్దేశం ప్రకారం.. ఏదైనా పెంపుడు డాగ్ వీధిలో మలవిసర్జ చేస్తే.. దాని యజమనులకు దాదాపు రూ.1000 వరకూ జరిమాన విధించే అవకాశం ఉంది. అయితే ఆ జరిమాన అనేది ఆయా మున్సిపాలిటీలను బట్టి ఉంటుంది. అంతేకాకుండా పెంపుడు శునకాలు చేసిన మలవిసర్జనను యజమానులే తొలగించి శుభ్రం చేయాల్సి ఉంటుందని.. అలా చేయకపోతే రూ.1000 వరకూ ఫైన్ చెల్లించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.