తెలంగాణలో గత కొన్నిరోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలు చేస్తున్నారు. తమ భర్తలను ఒక చోట ఉంచకుండా పదే పదే వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారని, వాళ్లని కూలీల కంటే హీనంగా చూస్తున్నారని.. పోలీసులకు దక్కిన గౌరవం కూడా తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనలు ఉద్ధృతం కావడం వల్ల పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీసు శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
Also Read: రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు
రెండు రోజులుగా ఆందోళనలు
కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలు చేయడంతోనే పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకే పోలీసు విధానం ఉండాలని.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్నే అమలు చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు గత రెండురోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read: వచ్చే ఏడాదికి అది పూర్తి.. 3 వేల మందికి ఉపాధి: కిషన్ రెడ్డి
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు
తమ భర్తలతో పోలీసు విధులు కాకుండా కూలి పనులు చేయిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు చేసే పనులకు వాళ్లు చేస్తున్న దానికి సంబంధం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవులు రద్దు చేస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పోలీసు శాఖ తాత్కలికంగా నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ వ్యవహారంపై కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయం తీసుకుంది.