రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు రూ.10 నాణేలు చెల్లవనే అపోహ గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉంది. ఇవి చెల్లుతాయని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. ఈ నాణేలు చలామణిలో లేదన్న అపోహను తొలగించేందుకు బ్యాంకు అధికారులు కూడ విశేష కృషి చేస్తున్నారు. By B Aravind 25 Oct 2024 in నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి రూ.10 నాణేలు చెల్లవనే అపోహ గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉంది. ఏదైనా కిరణాషాప్‌కు వెళ్లినా, చిరు వ్యాపారుల దగ్గరకు వెళ్లినా లేదా మార్కెట్‌కు వెళ్లినా రూ.10 తీసుకునేందుకు వెనకాడుతున్నారు. కొద్దిమంది మాత్రమే వీటిని తీసుకుంటున్నారు. రూ.10 నాణేలు చెల్లుతాయని ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ నాణేలు చలామణిలో లేదన్న అపోహను తొలగించేందుకు బ్యాంకు అధికారులు కూడ విశేష కృషి చేస్తున్నారు. Also Read: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఏడుగురు షూటర్లు అరెస్టు.. అవగాహన కార్యక్రమం రూ.10 నాణేలు రోజువారీ లావాదేవీలు వినియోగించవచ్చని.. ఇవి చట్టబద్ధమైనవేనని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ, తెలంగాణ, కర్ణాటక జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ తెలిపారు. ఈ నాణేల చలామణి వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని ఆర్బీఐ ఉత్తర్వులు మేరకు అందరికీ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కోఠిలోని బ్యాంక్ శాఖ వద్ద రూ.10 నాణేల చలామణిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. Also Read: యమునా నదిలో నురుగు... స్నానం చేస్తే అంతే సంగతులా? ఈ సందర్భంగా ధారాసింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' తమ ఖాతాదారులు ఈ నాణేలు వినియోగించాలని సూచిస్తున్నాం. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో కూడా ఇవి చెల్లుబాటు అవుతున్నాయి. ప్రజల్లో రూ.10 నాణేలపై ఉన్న అపోహాలను తొలగించేందుకు ఈ మేళా నిర్వహించాం. ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ నాణేలను లావాదేవీలకు వాడుకోవచ్చు. రూ.10 నోటు కంటే నాణేమే ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. #telugu-news #national-news #reserve-bank-of-india #indian-rupees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి