Congress: ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్‌లోకి ముగ్గురు మాజీ మంత్రులు!

TG: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. త్వరలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ

Telangana Congress : తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది కాంగ్రెస్. ఈసారి రానున్న GHMC ఎన్నికలను టార్గెట్ చేస్తూ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ వాసులు కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా  ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు స్కెచ్ లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక  నేతలను, పలువురు కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరిపి.. చేరికకు కూడా వారు సిద్దమైనట్లు సమాచారం.

Also Read :  🔴IPL Auction Day -2: ఐపీఎల్ మెగా వేలం.. లైవ్ అప్డేట్స్!

ముగ్గురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు?..

బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్ లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనను కారు పార్టీ నుంచి దింపి తమ పార్టీలో కాంగ్రెస్ చేర్చుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ లో పట్టు ఉన్న నేతలకు కాంగ్రెస్ వల విసిరినట్లు సమాచారం. ఇందులో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురికి కాంగ్రెస్ లో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్‌.. 295కే ఆసిస్ ఆలౌట్

వీరి చేరిక వల్ల హైదరాబాద్ జంట నగర్లో గులాబీ పవర్ నుం తగ్గించి హస్తం హావా పెంచుకోవాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముగ్గురు మాజీ మంత్రుల్లో ఇద్దరి చేరిక.. మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. సబితా మాత్రం కొంచెం సందేశంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి వీరి చేరిక ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు.. మరోవైపు GHMC ఎన్నికలతో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి.  

ఇది కూడా చదవండి: KTR: తప్పు జరిగింది.. పొరపాటైంది: లగచర్ల మహాధర్నాలో కేటీఆర్

కేసులు, అరెస్టుల భయం..?

తెలంగాణ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు అరెస్టులు, కేసుల భయం పట్టుకుందని అంటున్నారు రాజకీయ నిపుణులు. అయితే.. కేసులు, అరెస్టుల నుంచి బయటపడేందుకే మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. మల్లారెడ్డిపై భూ అక్రమాల కేసులు.. గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇలా ఇద్దరు చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసుల నుంచి బయటపడాలంటే.. తాము కాంగ్రెస్ లో చేరడమే కరెక్ట్ అని వారి భావించారని.. త్వరలో వీరి చేరిక తథ్యం అని వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ మార్పుపై వీరి స్పందించకపోవడంతో ఈ ప్రచారాలకు మరింత బలం చేకూరినట్లైంది. మరి వీరి పార్టీ మారుతారా? లేదా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా? అనేది వేచి చూడాలి.   

Also Read :  మొత్తానికి అసలు బాయ్ ఫ్రెండ్ ఎవరో బయటపెట్టిన రష్మిక..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు