BC reservations : వాళ్లకోసమే మరోసారి సర్వే.. మంత్రి పొన్నం క్లారిటీ

సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో బీసీ సంక్షేమ శాఖ, రాష్ట్ర రవాణా శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమావేశమయ్యారు. ఎవరైతే సర్వేలో సమాచారం ఇవ్వలేదో.. వారి నుంచి సమాచారం సేకరించడానికి మాత్రమే ఫిబ్రవరి 28 వరకు మరోసారి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.

New Update
BC reservations

BC reservations

BC reservations :  సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో బీసీ సంక్షేమ శాఖ, రాష్ట్ర రవాణా శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే రాష్ట్రాలన్నింటికీ మార్గదర్శకంగా నిలిచిందని.. కొంత మంది సర్వేలో పాల్గొనకుండా తమ సమాచారాన్ని ఇవ్వకపోవడంతో ఫిబ్రవరి 28 వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు.ఎవరైతే సర్వేలో సమాచారం ఇవ్వలేదో.. వారు సమాచారం ఇవ్వడానికి మరొక అవకాశం మాత్రమే అని చెప్పారు.

Also Read: ఇదేం ఉద్యోగం తల్లి.. ‘వర్క్ ఫ్రమ్ కార్’.. పోలీసుల పనికి అంతా షాక్!

ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే బీఆర్ఎస్ అగ్రనేతలు కుల గణన సర్వేలో పాల్గొని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఇదీ రీ సర్వే కాదని స్పష్టం చేశారు.  సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలు.. అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా తెలంగాణలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలి. సర్వే పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సామాజిక మార్పు కలిగించే నిర్ణయం ఇది అని అన్నారు. రాజకీయ విమర్శల కోసమే బీజేపీ నేతలు.. బీసీలు, ముస్లింలపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బీసీలక స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.  

Also Read: ఇదేం ఉద్యోగం తల్లి.. ‘వర్క్ ఫ్రమ్ కార్’.. పోలీసుల పనికి అంతా షాక్!

 ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, బీసీ కమీషన్ చైర్మన్ నిరంజన్ , బీసీ కమిషన్ సభ్యులు, ఎంపీ సురేష్ షెట్కర్ ,ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ జ్ఞానేశ్వర్, ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమూర్తి, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, పలువురు బీసీ సంఘం నేతలు, ఫ్రొఫెసర్లు పాల్గొన్నారు.

Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!
 
 కుల గణన సర్వే లో పాల్గొనని వారికి ఈనెల 16 నుండి 28 మధ్య సర్వే లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ,మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీసీ సంఘాల నేతలు  ధన్యవాదాలు తెలిపారు.

Also Read :  రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు