Ex MLA Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు
చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. భూమిని కబ్జా చేసాడంటూ బాధితుడు ఫిర్యాదు చేయడంతో జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. భూమిని కబ్జా చేసాడంటూ బాధితుడు ఫిర్యాదు చేయడంతో జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన మాల్.. బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ అధికారులు ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ మాల్ ఎట్టకేలకు మళ్లీ తెరుచుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రీఓపెన్ అయ్యింది.
TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మే 27నుంచి జూన్ 30వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది. మూడో దశ పనుల కారణంగా వరంగల్, కరీంనగర్, కాజీపేట, బల్లార్షా, సిర్పూర్, బోధన్ మీదుగా వెళ్లే ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు.
TG: ఒక వ్యక్తి యొక్క భవన నిర్మాణానికి సంబంధించి అధికమొత్తంలో పన్ను చెల్లించకుండా ఉండటం కోసం 30 వేల రూపాయలు లంచం తీసుకుంటున్న నిర్మల్ జిల్లా, భైంసా పట్టణ మున్సిపల్ కమిషనర్ - వెంకటేశ్వరరావు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్‌ను వలపన్ని ఏసిబి అధికారులు పట్టుకున్నారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ SR విద్యాసంస్థల్లోని పట్టభద్రులతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఈరోజు సమావేశం అయ్యారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో సీబీఐ, ఈడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది.
తెలంగాణ లో కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ ఎన్నికల సమయం ముగిసింది.జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో పంచాయతీ ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.
TG: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తమతో ఉన్నదెవరో సమయం వచ్చినప్పుడు చెప్తాం అని అన్నారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.