/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Current-Shock.jpg)
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లా1 రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంప్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల వీచిన ఈదురుగాలులకు చెట్లు మీద పడి గ్రామంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో కరెంట్ తీగలు ప్రమాదకరంగా భూమిపై పడి పోయాయి. సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన షేక్ లతీఫ్(29) ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా కింద పడి ఉన్న విద్యుత్ తీగలపై ప్రమాదవశాత్తు కాలు వేయడంతో షాక్ కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్తంభాలు విరిగి పోయాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే నిండు ప్రాణం బలైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కరెంట్ అధికారుల నిర్లక్ష్యం.. కరెంట్ షాక్తో యువకుడు మృతి
కామారెడ్డి - రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంప్ గ్రామంలో ఆదివారం వీచిన ఈదురుగాలులకు చెట్లు మీద పడి విద్యుత్ స్తంబాలు విరిగిపోయాయి.
సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన షేక్ లతీఫ్(29) ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా… pic.twitter.com/JI1dCgGfJc
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2024