Telangana : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థులు దుర్మరణం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి గౌతమ్ కుమార్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ముక్క నివేశ్ అమెరికాలో కారు ప్రమాదంలో మృతి చెందారు.