D. Srinivas: డీఎస్ మృతిపట్ల రేవంత్రెడ్డి, చంద్రబాబు సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డీఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.