BIG BREAKING: తెలంగాణలో సీఎం మార్పు
తెలంగాణలో సీఎం మార్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జ్ ను మార్చిందన్నారు. నెక్స్ట్ సీఎం రేవంత్ ను మార్చనుందని జోస్యం చెప్పారు.
తెలంగాణలో సీఎం మార్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జ్ ను మార్చిందన్నారు. నెక్స్ట్ సీఎం రేవంత్ ను మార్చనుందని జోస్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం 8 గంటలకు ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 MLC స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగ్గా.. ఈరోజు కౌంటింగ్ చేస్తున్నారు.
నిజాంసాగర్ కెనాల్ నీటి విడుదలలో అధికారుల విధానాలను నిరసిస్తూ నీటిపారుదల శాఖ అధికారులను రైతులు నిర్భందించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోని సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసుల జోక్యంతో వారిని వదిలేశారు.
మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు MLC కవిత కౌంటర్ ఇచ్చారు. న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో గుండె పోటుతో మరణించారన్నారు. భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగిందన్నారు. దుబాయ్ లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లో వచ్చిందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 70 మంది, తెలంగాణలో 90 మంది అభ్యర్థులు MLC ఎన్నికల బరిలో ఉన్నారు. పట్టభద్రుల, టీచర్స్ MLC లను ఎన్నుకోడానికి అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది.
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలసభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ లను రప్పిస్తే, 24గంటల్లోనే ktr ను అరెస్ట్ చేస్తామన్నారు.
తెలంగాణ మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 25 నుంచి 27 వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 25న సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు షాపులు మూసి ఉంటాయి.
మిర్చీ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. గణేష్ అనే రైతు ఎనిమిది ఎకరాల్లో మిర్చి, పత్తి పంటను సాగు చేశాడు. క్వింటానర మాత్రమే దిగుబడి రావడంతో పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌లా మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని అన్నారు. సుప్రీం కోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్న కవిత.. సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న మొదటి సీఎం రేవంత్ కావడం తెలంగాణ ఖర్మ అని చెప్పారు.