Telangana: తెలంగాణలో స్పెషల్ పోలీస్ స్టేషన్లు.. ఇకపై వారికి చుక్కలే!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేక నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌, సైబర్ క్రైమ్ పీఎస్‌‌‌‌‌‌‌‌ల తరహాలోనే కేసులు దర్యాప్తు చేస్తారు. 

author-image
By srinivas
rerewrrrr
New Update

Narcotics Police Stations : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌  పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా జిల్లాల్లోని అన్ని యూనిట్స్‌‌‌‌‌‌‌‌లో ఈ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయనుండగా లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌, సైబర్ క్రైమ్ పీఎస్‌‌‌‌‌‌‌‌ల తరహాలోనే కేసులను దర్యాప్తు చేయనున్నాయి. టీజీ యాంటీ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో ఇందులో కార్యక్రమాలు నిర్వహించనుండగా.. ప్రతి పీఎస్‌‌‌‌‌‌‌‌కు డీఎస్పీ స్టేషన్ హౌస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నారు. 

ఇది కూడా చదవండి: విడాకుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అందులో భార్యకు హక్కు!

Also Read :  మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..!

ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నమోదయ్యే కేసులు..

ఇక ఇందులో భాగంగానే వరంగల్‌‌‌‌‌‌‌‌ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నమోదయ్యే కేసులను దర్యాప్తు చేస్తారు. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు రిజిస్టర్ చేసే కేసులను నార్కొటిక్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేయనున్నారు. లా అండ్ ఆర్డర్ పీఎస్‌‌‌‌‌‌‌‌లలో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై నియమించనున్నారు. ఇప్పటికే టీ న్యాబ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించగా.. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరును కనబరిన పోలీస్ సిబ్బందిని నార్కొటిక్స్ స్టేషన్ లలో నియమించనున్నారు. ఇక ప్రస్తుతానికి హైదరాబాద్ నాంపల్లి, హైదరాబాద్ పాత కలేక్టరేట్‌‌‌‌‌‌‌‌, హఫీజ్‌‌‌‌‌‌‌‌పేట, రాచకొండ,‌‌‌‌‌‌ సరూర్‌‌‌‌‌‌‌‌నగర్ లో నార్కొటిక్స్ స్టేషన్లను‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Video: చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్‌ చేసి..!

Also Read :  ఎర్త్ మ్యాగ్నెట్ వేగంతో మార్పులు..ప్రళయం తప్పదా?

#telangana #narcotic #police-station
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe