Telangana: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు
తెలగు రాష్ట్రాల్లో ఇవాళ , రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. తెలంగాణ మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా జల్లులు కురుస్తాయని తెలిపింది.
తెలగు రాష్ట్రాల్లో ఇవాళ , రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. తెలంగాణ మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా జల్లులు కురుస్తాయని తెలిపింది.
గొర్రెల కొనుగోలు పంచాయితీ పోలీసుల ప్రాణాలమీదకొచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణకు వెళ్లిన నల్గొండ జిల్లా చెన్నంపేట ఎస్ఐ సతీష్‌తోపాటు సిబ్బందిపై వెఎస్ ఆర్ జిల్లా చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివ గ్యాంగ్ దాడికి పాల్పడ్డారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది.
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీన 65కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నల్లగొండలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన వెల్లడించారు.ఫిబ్రవరి 26వ తేదీన 100కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది.
కాంగ్రెస్‌లో చలమల కృష్ణా రెడ్డి చేరికపై గందరగోళం నెలకొంది. ఆయన చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అందెం సంజీవ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చలమల కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు. దీంతో ఆయన తిరిగి బీజేపీలో చేరుతారనే చర్చ జోరందుకుంది.
మరో గురుకుల విద్యార్థిని దారుణానికి పాల్పడింది. సూర్యపేటలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇరుగు అస్మిత హైదరాబాద్ లోని తమ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. కూతురు ఆకస్మిక మరణంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనపై కృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. అలాంటి వాడిని పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని అన్నారు. ఒకవేళ అతన్ని చేర్చుకుంటే తనను ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకున్నారని ప్రశ్నించారు.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన స్థలం సరికాదని మంత్రి ఉత్తమ్ అన్నారు. డిజైన్, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం వల్లే మేడిగడ్డ కొంగినట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని అన్నారు.
తనకు రాజ్యసభ టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఉన్న జానారెడ్డికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో జానారెడ్డి పేరు లేదు. దీంతో జానారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జానారెడ్డి నల్గొండ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.