Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్-A, ప్లాన్-B ఇదే.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ప్లాన్ A అంటే పార్టీలో ఉంటే నా వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ B అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి...సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంత మంది వస్తారు ? అని అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కుట్ర జరుగుతోందన్నారు. By Nikhil 10 Apr 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి మీడియా చిట్ చాట్ లో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కుట్ర జరుగుతోందన్నారు. భట్టి పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారన్నారు. యాదగిరిగుట్టలో భట్టిని కింద కూర్చోపెట్టి అవమానించారన్నారు. ఈ క్రమంలోనే భట్టి డ్రైవర్‌పై మొన్న దాడి జరిగిందన్నారు. భట్టి B-ట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్లే లీకులు ఇచ్చారన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమైందన్నారు మహేశ్వర్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పదవి తీసి తమ్ముడికి ఇస్తారేమో అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంతే అనుకుంటున్నారన్నారు. సీఎం పదవి కోసం పది మంది పోటీపడుతున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: నేను అమ్ముడుపోలేదు.. కాంగ్రెస్ లో అందుకే చేరిన: భద్రాచలం ఎమ్మెల్యే సంచలన ఇంటర్వ్యూ చంద్రబాబుకు, రేవంత్‌కు పోలికలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌లో ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ ఉన్నాయన్నారు. 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని రేవంత్ చూస్తున్నారన్నారు. రేవంత్‌కు పోటీగా 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేశారన్నారు. సీఎం స్థాయిలో ఉండి కుట్ర జరుగుతోందని రేవంత్ అనడం ఆయన అసమర్ధతకు నిదర్శనమన్నారు. గేట్లు ఓపెన్ చేసినా, విండోలు ఓపెన్ చేసినా కాంగ్రెస్‌లోకి ఎవరూ వెళ్లడం లేదన్నారు. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌లో కంఫర్ట్ లేదన్నారు. సొంత దుకాణం కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. తమ ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో లేరన్నారు. కాంగ్రెస్‌లో ఐదుగురు షిండేలున్నారు మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్లాన్ A అంటే పార్టీలో ఉంటే నా వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ B అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి...సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంత మంది వస్తారు ? అని అన్నారు. రేవంత్ టెన్షన్ తట్టుకొలేక ఒక ఐపీఎస్ అధికారి గుండెపోటుతో మరణించారన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి