TS News: దొంగ సర్టిఫికెట్‌తో అడ్డంగా బుక్కైన డీఎంహెచ్‌వో

ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కుమారుడి ఉన్నత చదువు కోసం దొంగ సర్టిఫికెట్‌ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్‌. ఆ తప్పుడు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ కలెక్టర్‌ గెజిట్‌ విడుదల చేశారు.

New Update
fake caste certifcate

Fake Caste Certifcate

TS News: కుమారుడి చదువు కోసం ప్రభుత్వాధికారి అడ్డదారులు తొక్కాడు. తాను ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కొడుకు ఉన్నత చదువుల కోసం దొంగ సర్టిఫికెట్‌ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు. సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్‌ సమర్పించిన తప్పుడు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ను కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ రద్దు చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి గెజిట్‌ కూడా విడుదల చేశారు. సూర్యాపేటలో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్థన్‌ ఎస్సీ కులానికి చెందిన అరుణజ్యోతిని వివాహం చేసుకున్నారు.  ఈ దంపతులకు ప్రణవ్ వర్దన్, ప్రత్యూష్ వర్దన్ కుమారులు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో 2017 సంవత్సరంలో విడిపోయారు.

ఇది కూడా చదవండి: మహిళలు ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ 5పనులు చేయాల్సిందే?

దొంగ సర్టిఫికెట్ పెట్టి..

పిల్లలు మాత్రం తండ్రి హర్షవర్థన్‌ దగ్గరే ఉంటూ చదువుకుంటున్నారు. 2018 వరకు పిల్లల క్యాస్ట్‌ బీసీ(డి)గా స్కూల్‌ రికార్డ్స్‌లో ఉంది. అయితే 2019లో తల్లి పేరు లక్షమ్మ అంటూ.. ఎస్సీ మాలగా దొంగ సర్టిఫికెట్ పెట్టి నమోదు చేశారు. అంతేకాకుండా ఎస్సీ కోటాలో నార్కెట్‌పల్లి కామినేని మెడికల్​ కాలేజీలో ప్రణవ్‌కు పోయిన సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. దీంతో డీఎంహెచ్‌వోపై ఎస్సీ ఐక్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గుండమల్ల మల్లేశ్​ ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఈ వ్యవహారంపై ఒక కమిటీ కూడా వేశారు. అడిషనల్ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఎస్సీ, బీసీ డెవలప్​మెంట్ ఆఫీసర్లు, DTWO సభ్యులుగా పెడుతూ DLSC కమిటీని ఏర్పాటు చేశారు. 

ఇది కూడా చదవండి: అందమైన అమ్మాయిలు ఉండే దేశాలు ఇవే

సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే హర్షవర్థన్‌కి చెందిన బీసీ(డీ) కులం మాత్రమే కాకుండా తల్లికి చెందిన ఎస్సీ మాల కులంపై నకిలీ సర్టిఫికెట్లు క్రియేట్‌ చేసినట్టు గుర్తించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు కమిటీ అందించింది. దీంతో ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేయడమే కాకుండా గెజిట్‌ కూడా విడుదల చేశారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. కావాలంటే కోర్టుకు వెళ్లొచ్చని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  గర్భిణులు ఉపవాసం చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇది కూడా చదవండి: 12 ఏళ్ళ తర్వాత తల్లి కాబోతున్న బాలయ్య హీరోయిన్.. బేబీబంప్ ఫొటోలు వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు