/rtv/media/media_files/2024/11/18/62Cchnt7w8hla5vr5dkS.jpg)
Bhuvanagiri district suicide
Bhuvanagiri District : ఈ మధ్య ప్రేమ పేరుతో జరిగే దాడుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రేమించలేదని, ప్రేమ అంగీకరించలేదని అమ్మాయిల పట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు కొంతమంది ప్రేమోన్మాదులు. తాజాగా ప్రేమ వేధింపులకు మరో యువతి బలైంది.
Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!
సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్ లు
యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని విద్యానగర్ లో హాసిని అనే యువతి డిగ్రీ చదువుతోంది. అయితే హాసిని హఠాత్తుగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల వివరాల ప్రకారం నిఖిల్ అనే యువకుడు తమ కూతురిని స్నాప్ చాట్, ఇన్ స్టాగ్రామ్ లో అసభ్యకర మెసేజ్ లు పంపుతూ వేధించినట్లు తెలిపారు. అతడి వేధింపులు తట్టుకోలేకే హాసిని ఉరేసుకున్నట్లు ఆరోపించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
Also Read: Pushpa2: 'పుష్ప2' ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీల, బన్నీ లుక్ మామూలుగా లేదు!
ఇటీవలే నార్సింగ్ లో మరో యువతి
ఇటీవలే హైదరాబాద్‌లోని నార్సింగిలో శ్రీజ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన శ్రీజ అనే యువతి కోఠి ఉమెన్స్ కాలేజీలో శ్రీజ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. రెండు రోజులు కిందట హైదర్‌షాకోట్‌లో ఉన్న తన అక్క ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?
Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ
https://www.facebook.com/photo/?fbid=556568873636750&set=a.137655232194785