Chengicherla Mandi Goat Market : అక్కడ మటన్ కిలో రూ.500లకే..ఎందుకో తెలుసా?

వేలాది రూపాయాలు పెట్టి మటన్ తినలేని మధ్యతరగతి వారికి చెంగిచర్ల మేకల మండి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.800 నుంచి రూ.1000 పలుకుతున్న మటన్ ఇక్కడ సగం ధరకే లభిస్తోంది. అందులోనూ ఫ్రేష్ గా లభిస్తుండంతో మాంసం ప్రియులు క్యూ కడుతున్నారు.

New Update
Mutton Mandi Chengicherla

Mutton Mandi Chengicherla

Chengicherla Mandi Goat Market : ఆదివారం వచ్చిందంటే ఉద్యోగస్తులతో పాటు పిల్లలకు సెలవు దినం. ఆ రోజున అందరూ ఇంటిదగ్గరే ఉంటారు కనుక ఎవరికైనా మంచి నాన్‌వెజ్‌ తినాలిపించడం సహజం. ఇటీవల బర్డ్‌ప్లూ భయంతో చికెన్‌ తినేవారి సంఖ్య తగ్గిపోయింది. పోనీ మటన్‌ తీసుకుందామనుకుంటే బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.800 నుంచి రూ.900 మధ్య ఉంటోంది. సరే డబ్బులు పోనీ తెచ్చుకుందామనుకుంటే అది మేకతో, గొర్రెదో, ఫ్రెష్‌నో , కాదో అనే సందిగ్ధం. పోనీ ఏదో మటన్ బిర్యానీ ఆర్డర్‌ పెడుదామంటే పేరుకే మటన్‌ బిర్యానీ కానీ ముక్కల కోసం వెతుక్కోవలసిందే.

Also Read:Telangana Crime: కుటుంబ కలహాలతో తల్లిని నరికి చంపిన కొడుకు

అసలే తెలంగాణ వారికి పండగయినా, పెళ్లయినా, చుట్టాలొచ్చినా, దోస్తులొచ్చినా మాంసం లేకుండా ముద్ద దిగదు. అలాంటిది నలుగురు ఇంటికొస్తే రెండు కిలోల మాంసం తీసుకోవాలి. మధ్యతరగతి వారికి ఇది తలకు మించిన భారమే.ఆర్థిక స్థోమత ఉన్నవారు మటన్ తెచ్చుకుని విందు కానిస్తే , లేనివారు చికెన్‌తో సరిపెట్టుకుంటున్నారు. తెలంగాణలో గొర్రెల పెంపకం తగ్గడంతో మటన్‌ ధరలు మరింత చుక్కలనంటుతున్నాయి. ఒకప్పుడు చికెన్ ధరతో సమానంగా ఉండే మటన్.. ఇప్పుడు సామాన్యులు కొనలేని స్థితికి చేరింది. ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో కిలో మేక మాంసం రూ.750కు పైగా ఉండగా.. హైదరాబాద్ నగరంలో అయితే రూ.800 నుంచి రూ.1000 వరకు ఉంది. పండుగ సమయంలో ఈ ధర మరింత ఎక్కువగా ఉంటోంది.

Also Read: Trump-Musk-Rubio: ట్రంప్‌ క్యాబినెట్‌ మీటింగ్‌ లో గొడవ పడ్డ మస్క్‌..రూబియె


ఈ అధిక ధరల వల్ల మధ్యతరగతి ప్రజలు మటన్‌ను తరచూ తినలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చికెన్ తిందామంటే బర్డ్ ఫ్లూ భయం.. చేపలు తిందామంటే నాణ్యతపై అనుమానం..దీంతో మాంసం తినాలనుకునేవారికి తీరని కోరికగానే మిగిలిపోతుంది. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో  హైదరాబాద్ శివారులోని చెంగిచెర్ల మార్కెట్ మాంసం ప్రియులకు కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. కారణం ఇక్కడ మేక మాంసాన్ని తక్కువ ధరకు అందించడమే. హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలం పరిధిలో ఉన్న చెంగిచెర్ల గ్రామంలో ఉన్న మేకల మార్కెట్‌ (మండి) రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి రోజు వందల సంఖ్యలో మేకలను విక్రయిస్తుంటారు. మరోవైపు వందలాది మేకలను వధించి.. మార్కెట్లో తక్కువ ధరకే మాంసం విక్రయిస్తారు. నగరంలోని ఇతర మార్కెట్లతో పోల్చితే.. ఇక్కడ మటన్ ధర సగమే ఉంటుంది. కిలో మేక మాంసం కేవలం రూ.500 నుంచి రూ.600 మధ్యలోనే లభిస్తుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే రూ.400 కిలో ఇచ్చేవాళ్లు కూడా ఉన్నారు.

Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇక్కడ మటన్ ఒక్కటే కాదు.. లివర్, బోటీ, కాళ్లు, తలకాయ ఇలా మేకకు సంబంధించిన అన్ని రకాల మాసం కూడా లభిస్తోంది. ఇక్కడ బోటీ ధర కిలో రూ.150లకే దొరుకుతుంది. ఇక్కడి నుంచి మటన్ తీసుకొని వెళ్లడానికి  దూర ప్రాంతాల నుంచి కూడా వినియోగదారులు వస్తుంటారు. ఏదైనా వేడుకలు చేసుకునే వారికి ఇది మంచి మార్కెట్‌.  ఇక్కడ మన కోరుకున్న మేకను మన కళ్లముందే వధించి దాని మాంసాన్ని  ఇస్తారు. కనుక అనుమానాలకు తావులేదు.  కనుక ఈసారి ఏదైనా పండుగొచ్చినా, ఇంటికి చుట్టాలొచ్చినా భయపడకంటి ఛలో చెంగిచర్ల.'

Also read: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు