నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బంది పడుతారు: అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మూసీ ప్రక్షాళన కోసం బీఆర్‌ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్‌ను నేను వద్దని చెప్పలేదా ? నేను నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బందులు పడతారని'' అసదుద్దీన్ అన్నారు. By B Aravind 02 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పేదవాళ్ల ఇల్లు కూల్చేస్తున్నారంటూ ఇటీవల బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్‌ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్‌ను నేను వద్దని చెప్పలేదా ? అని వ్యాఖ్యానించారు. నేను నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బందులు పడతారన్నారు. ఇళ్ల జోలికి రాకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. Also Read: కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు అలా చేసుంటే బీఆర్ఎస్ గెలిచేది బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలంటూ సూచించారు. వాళ్లకి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు ఆ పార్టీకి జీహెచ్‌ఎంసీలో ఎక్కువ సీట్లు రావడానికి కారణం మేమేనని తెలిపారు. ఎంఐఎం మద్దతుతోనే బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయని.. 24 మంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్‌ఎస్ మళ్లీ గెలిచేదని అన్నారు. ఆ పార్టీలో నేతలకు అప్పట్లో అహంకారం ఉండేదన్నారు. మరోవైపు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు నాయుడు, ,స్టాలిన్ అంటున్నారని.. ఒకవేళ ఈ విషయం నేను చెప్పితే నానా రాద్ధాంతం చేసేవారన్నారు. దక్షిణ భారత్‌లో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారని.. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలే నష్టపోతాయని తెలిపారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గడ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అన్నారు. దేశ అభివృద్ధిలో బాగా పనిచేసిన రాష్ట్రాలను శిక్షించడం వల్ల ఏం లాభం అంటూ ప్రశ్నించారు. Also Read: డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన ఇదిలాఉండగా.. కేంద్రప్రభుత్వం ఇటీవల 2025లో జనగణన, 2028 నాటికి డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల జనాభాను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలకే లాభం ఉంటుందని.. జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టం గురించి ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇటీవల చంద్రబాబు, స్టాలిన్‌లు ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే అంశాన్ని తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. #telangana #telugu-news #asaduddin-owaisi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి