Accident In USA: అమెరికాలో మంచిర్యాలకు చెందిన తల్లీ కూతురు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తల్లీ కుమార్తె మృతి చెందారు.  కారును టిప్పర్ ఢీకొట్టడంతో రమాదేవి, తేజస్విలు మృతి చెందగా..మరి కొందరు గాయపడ్డారు. 

New Update
us accident

మంచిర్యాలలోని రెడ్డి కాలనీకు చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు విఘ్నేష్, రమాదేవిలు ఈమధ్యనే అమెరికాకు వెళ్ళారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. స్రవంతి, తేజస్వి ఇద్దరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. తేజస్వి గృహప్రవేశం కోసం లాస్ట్ మంత్ 18న విఘ్నేష్, రమాదేవిలు అమెరికాకు వెళ్ళారు. ఈ క్రమంలో తేజస్వి పెద్ద కొడుకు నిశాంత్ బర్త్‌డే ఉండడంతో మొత్తం కుటుంబం అంతా కలిసి సరదాగా బయటకు వెళ్ళారు. శుక్రవారం అంతా బయట ఉండి..శనివారం తిరిగి వస్తుండగా...వారి కారు ప్రమాదానికి గురైంది. కారును టిప్పర్‌ గుద్దేయడంతో ప్రమాదం జరిగింది. ఇందులో రమాదేవి, తేజస్విలు అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు