Etela Rajender: నువ్వు బ్రోకర్ వి కాదు.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్!

ఫార్మా పరిశ్రమ భూసేకరణ ఇస్యూలో ఆందోళనకారులను అరెస్టు చేయడంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని ఆయన రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు.

New Update

ఫార్మా పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై గ్రామస్థులు నిన్న దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారులపై దాడి చేసిన ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి సమయంలో పోలీసులు ఆందోళనకారులను లిఫ్ట్ చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కొడంగల్, దుద్యాల, బొంరాస్‌పేట్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. ఇక ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి స్పందించారు.

ఇది కూడా చదవండిః ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా ఆయనే..!

ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. అయితే దానిని అక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. తమ భూములు గుంజుకోకండి, తమ ఉపాధి మీద దెబ్బకొట్టకండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. 

ఇది కూడా చదవండిః Dwacra: డ్వాక్రా మహిళలకు తీపి కబురు.. ఆ పథకం కింద రూ.10 లక్షలు!

వ్యతిరేకిస్తూ రైతులు ధర్నాలు

దీనిని వ్యతిరేకిస్తూ రైతులు ధర్నాలు చేసి నిరసనలు తెలిపారని.. గ్రామసభలను కూడా బహిష్కరించారన్నారు. అంతేకాకుండా స్వయంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా నిర్వహించారని.. అయినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.

బలవంతంగా తీసుకునే అధికారం ఎవరిచ్చారు

ఇక దీనిని అడ్డం పెట్టుకొని కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాలలో మోహరించి అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నామన్నారు. భూ సేకరణ రైతుల ఇష్ట ప్రకారం చేయాలి తప్ప బలవంతంగా తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. గతంలో ముచ్చర్లలో ఫార్మసిటీ కోసం 8 లక్షలకు భూములు సేకరించి కోటి రెండు కోట్లకు ఫార్మా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేసినపుడు.. ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు వ్యతిరేకించిందని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండిః కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు

ఇచ్చిన హామీలు అమలు కాలేదు

బీజేపీ తరఫున తాము కూడా వ్యతిరేకించామన్నారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వపరమైన భూములు ఇవ్వండి కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్తున్నారు.. కానీ ఇప్పటివరకు భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదని.. ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఫైర్ అయ్యారు.

ఇది కూడా చదవండిః దొంగలతో కానిస్టేబుల్ దోస్తీ.. చివరికి వారిచేతిలోనే హతం, కారణం ఇదే!

ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి కాదు

ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని ఫైర్ అయ్యారు. పేదల భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములతో డబ్బులు సంపాదించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

ఫార్మాసిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికంపై ప్రభుత్వం చేస్తున్న దుచ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. రైతుల మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఇక ప్రజలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుదామని.. తామంతా అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు