PM Modi: హ్యాపీ బర్త్ డే రేవంత్... మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి. పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. By Bhavana 08 Nov 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి. పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. Also Read: Khammam: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు షాక్.. తొలగిస్తూ ఉత్తర్వులు Revanth Reddy Birthday Wishes From PM Modi ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే... సీఎం హోదాలో ఫస్ట్ పుట్టిన రోజు జరుపుకుంటున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రేవంత్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Also Read: Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్ ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఓ అభిమాని రేవంత్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది శుభాకాంక్షలు తెలియజేశాడు. నేడు రేవంత్ యాదాద్రి చేరుకొని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది పై సీఎం సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం సంగెం నుంచి సీఎం మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. Also Read: AP ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. నెల రోజుల్లోనే.. టాలీవుడ్ పద్మభూషణుడు చిరంజీవి ఎక్స్ వేదికగా రేవంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవనీయులైన సీఎం గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..రానున్న సంవత్సరం మీకు మరింత అద్భుతంగా ఉండాలి. ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి ఎక్స్ వేదికగా తెలిపారు. Also Read: Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు . దేవుడు మీకు ఆరోగ్యం , ఆనందం, విజయాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అంటూ నటి ఖుష్బూ శుభాకాంక్షలు తెలియజేశారు. #chiranjeevi #pm-modi #revanth-reddy-birthday మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి