BIG BREAKING: నా కొడుకుల మీద ఒట్టు.. అందుకే BRS నుంచి బయటకు.. మండలిలో కవిత కన్నీటి స్పీచ్!

శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్లకే తనపై కక్ష మొదలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update

శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్లకే తనపై కక్ష మొదలయ్యింది. 8 ఏళ్లు స్వతంత్రంగా జాగృతిని నడపాను. జాగృతి సంస్థను అడ్డుకోవాలని మొదటి నుంచే ప్రయత్నాలు జరిగాయి. నా వద్దకు పెద్దవాళ్లు, పైరవికారులు రాలేదు. ఇన్నాళ్లుగా పేదల కోసమే నేను పనిచేశాను. పార్టీ పేపర్లు, ఛానళ్లు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. రాజకీయ కక్షలతో నన్ను జైల్లో పెట్టారు. ఎప్పుడూ కూడా నాకు పార్టీ అండగా లేదు. బీఆర్‌ఎస్‌లో డిసిప్లినరీ కమిటీ అనేది పెద్ద జోక్. నా అభిప్రాయం తెలుసుకోకుండానే నన్ను సస్పెండ్ చేశారు. ఎలాంటి నైతికత లేని బీఆర్‌ఎస్‌ నుంచి వైదొలుగినందుకు సంతోషిస్తున్నాను. ఉద్యమకారులను, మనకు సపోర్టు ఇచ్చిన వాళ్లను పార్టీ గుర్తించలేదు. పార్టీ అంతర్గత సమావేశాల్లో నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. రాజకీయ పార్టీలు ఒక దిక్సూచిగా ఉండాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది.  

ధర్నా చౌక్‌ను రద్దు చేయడం ప్రజాస్వామ్యక హక్కును హరించడమే అవుతుంది. రైతులను బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టులు చేశారు. సెక్రటేరియట్‌లో కొత్త కలెక్టరేట్‌లో చాలా అవినీతి జరిగింది. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్‌లతో తీవ్రంగా అవినీతి బయటపడింది. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయమని.. కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వమని అడిగాను. నేరెళ్ల ఘటనలో ఇసుక దందాతో దళిత బిడ్డలు బలైపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపై చర్యలు తీసుకోవట్లేదు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని వంద సార్లు అడిగాను. కానీ ప్రభుత్వం స్పందించలేదు. కేసీఆర్ కింద ఉన్న వ్యక్తులు అనేక దురాగతాలకు పాల్పడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారుస్తామని చెప్పినప్పుడు నేను వద్దని చెప్పాను. 

తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టమని కేంద్రానికి వెళ్లి రాజకీయం చేస్తాం. కాలేశ్వరం కట్టే కంటే పేద ప్రజలను ఆదుకునేది ఉండాల్సింది. లక్ష కోట్లు ఖర్చు పెడితే ప్రతి కుటుంబానికి 500000 చొప్పున 20 లక్షల కుటుంబాలు బాగుపడేవి. మెగా కంపెనీని లక్ష ఐదు వేల కోట్లు బీఆర్ఎస్‌ కట్టబెట్టింది. బీజేపీ తెలంగాణను పదేపదే మోసం చేస్తోంది. నువ్వు పార్టీలో ఉండాలి కానీ ఏమీ అడగొద్దు, ఏం మాట్లాడొద్దని నన్ను కట్టడి చేశారు. గోష్ కమిటీ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే పార్టీలో ఎవరూ మాట్లాడలేదు. అదే హరీష్ రావు, కేటీఆర్ మీద మాట్లాడితే అందరూ మాట్లాడుతారు. కేసీఆర్ పై మచ్చ వేస్తే నేనే జాగృతి తరఫునుంచి ధర్నా చేశాను. హరీష్ రావు పెద్ద అవినీతిపరుడని నేను బయట చెప్పాను. అందుకే నన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నా సస్పెన్షన్‌ను బీఆర్‌ఎల్‌ చీలికగా రాజకీయంగా వాడుకుంటోంది. 

ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పోరాటం కాదు అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవ పోరాటమే. రాజకీయాల్లో మహిళలు లేరు. నా రాజీనామా తర్వాత మండలిలో ఇద్దరే మహిళలు ఉంటారు. రాజకీయాల్లో మహిళల శాతం 0.0003 శాతం మాత్రమే. మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత పెరగాలి. జనాలు కాంగ్రెస్‌ గెలిపిస్తే ఆ పార్టీ ప్రజలను నిర్లక్ష్యం చేసింది. 


పార్టీలో కొందరు కక్షగట్టి మరీ మహిళా నాయకురాలను ఎదగనీయకుండా కుట్ర చేస్తున్నారు. బయట జరిగే విషయాలు కేసీఆర్‌కు తెలియకుండా ఒక కోటరీ ఏర్పాటు అయింది.  నేను ఈరోజు ఓ వ్యక్తిగా బయటకు వెళ్ళిపోతున్నాను. కానీ భవిష్యత్తులో ఒక శక్తిగా తిరిగి ఇక్కడికి వస్తానని'' కవిత అన్నారు. అయితే కవిత భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకుంటున్నానని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజీనామాపై కవిత పునరాలోచించుకోవాలని సూచించారు. భావోద్వేగంలో రాజీనామా నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. చివరికి కవిత.. బీఆర్ఎస్ నుంచి వచ్చేది నాకు ఏది వద్దని.. తన రాజీనామాను అంగీకరించాలని కోరారు. ఇప్పటికే నాలుగు నెలలు ఆలస్యమయ్యిందని అన్నారు. 

Advertisment
తాజా కథనాలు