MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిపై వేటువేయాలని అన్నారు. కాంగ్రెస్ విధివిధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకం అని చెప్పారు. ఫిరాయింపులు మంచిది కాదని తాను అధిష్టాన పెద్దలకు చెప్పినట్లు తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మారదని తేల్చి చెప్పారు. తన అనుభవం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలని చట్టంలో ఉందని అన్నారు.
ఇది కూడా చదవండి: ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్!
అవమానాలకు గురవుతున్న....
తెలంగాణలో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ ఉందని అన్నారు. MIM ను మినహాయించిన కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఉందని చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తాను నాలుగు నెలలుగా అవమానాలకు గురవుతున్నట్లు తెలిపారు. తాను కూడా ఒక కాంగ్రెస్ నేత అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను చెప్పేది మొత్తం అధిష్టానానికి చెప్పానని.. తరువాత అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలీదని అన్నారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో హై టెన్షన్.. ఆ నిర్మాణం కూల్చివేసిన ఆందోళనకారులు!
కన్నీళ్లు పెట్టుకున్న జీవన్...!
కాగా నిన్న తన ముఖ్య అనుచరుడు జాబితాపూర్‌లో మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్యకు గురి కావడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హస్తం పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఆయనను పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత 40ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన తనకు మంచి బహుమతి లభించిందని మహేష్ తో అన్నారు. ఇంత జరిగాక తాను ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనను క్షమించాలంటూ చెప్పి మహేష్ కుమార్ మాట్లాడుతుండగా కాల్ కట్ చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన జీవన్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది.
ఇది కూడా చదవండి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన చేసే ఛాన్స్!
ఇది కూడా చదవండి: షర్మిల, విజయమ్మకు జగన్ షాక్.. పిటిషన్!