/rtv/media/media_files/2024/10/23/bS1vcXIhJXxO7yUuERpM.jpg)
Ambedkar Statue: హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం చుట్టూ గోడ కట్టడం వివాదానికి దారి తీసింది. జంక్షన్ సుందరీకరణ ప్రయత్నాల్లో భాగంగా అంబేడ్కర్ విగ్రహం చుట్టూ GHMC ప్రహరీ నిర్మాణం చేపట్టింది. కాగా అంబేడ్కర్ చుట్టూ గోడ కట్టడంపై కొందరు దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం కొత్త సంప్రదాయం అంటూ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. కాగా నిన్న అర్థరాత్రి అంబేడ్కర్ విగ్రహం ముందు గోడ ఉండటం ఇష్టం లేని కొందరు ఆందోళనకారులు దాన్ని కూల్చివేశారు. చుట్టూ గోడ కట్టి అంబేడ్కర్ విగ్రహం చుట్టూ చెట్లు, లైట్స్ పెట్టి అందంగా తీర్చేందుకే గోడ కట్టమని.. ఇందులో ఎవరి కించపరిచే ఉద్దేశం లేదని అధికారులు తెలిపారు.
VIDEO:
ట్యాంక్ బాండ్ అంబేద్కర్ చుట్టూ వెలసిన గోడ
— Telangana Awaaz (@telanganaawaaz) October 22, 2024
ఏళ్లుగా లేని కొత్త సంప్రదాయానికి తెరలేపిన ప్రభుత్వం
అంబేద్కర్ వేదికగా ఎన్నో , ఉద్యమాలు నిరసనలు
గోడ కట్టడంపై భగ్గుమంటున్న దళిత సంఘాలు
రేపు నిరసనలకు పిలుపు@INCTelangana@BRSparty@BJP4Telangana@KTRBRS@bandisanjay_bjp… pic.twitter.com/galB2xiSGD
అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా కట్టిన గోడను కూల్చేసిన నిరసనకారులు
— Gandhi media (@gandhi_media) October 22, 2024
సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు
ఉదయం నిర్మాణం, అర్ధరాత్రి కూల్చివేత#revanthreddy#telangana#ambedkr#Hyderabad#gandhimediapic.twitter.com/kOxwd4ajm3