అర్థంతారంగా రాలిన తార.. సిల్క్‌ స్మిత బయోపిక్ గ్లింప్స్‌

అలనాటి నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'సిల్క్‌ స్మిత - ది క్వీన్‌ ఆఫ్ సౌత్‌'. తాజాగా మేకర్స్ ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రలో చంద్రికా రవి నటించింది. ఈ గ్లింప్స్‌ మీరు కూడా చూసేయండి.

New Update

Silk Smitha biopic: 1980లలో సినిమా రంగంలో అడుగు పెట్టిన సిల్క్ స్మితా పేరు అప్పట్లో మారుమోగింది. ఆమె చనిపోయి దాదాపు 25 ఏళ్ళు దాటినా ఇప్పటికీ   సిల్క్ స్మితా పేరును మర్చిపోలేదు ప్రేక్షకులు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సిల్క్ స్మితా..  సినిమా రంగంలో ఎన్నో కష్టాలు, సమస్యల మధ్య  సక్సెస్ ఫుల్ నటిగా నిలదొక్కుకుంది. నటన, అభినయం, గ్లామర్ తో ఏ హీరోయిన్ కి దక్కనంత రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకుంది.   17 ఏళ్ల పాటు 5 భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ నటిగా రాణించింది. నటిగా మిలియన్ల అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న సిల్క్ స్మిత అర్థాంతరంగా జీవితాన్ని చాలించింది. 1996 సెప్టెంబర్ 23న  ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీగానే మిగిలింది. 

Also Read: సౌందర్యను అలా చేయడం బాధగా అనిపించింది.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్

సిల్క్ స్మిత బయోపిక్ 

అయితే సిల్క్ స్మిత జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ప్రపంచానికి తెలియజేయడానికి  'సిల్క్‌ స్మిత - ది క్వీన్‌ ఆఫ్ సౌత్‌'  అనే పేరుతో ఆమె బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్  జయరామ్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. సిల్క్ స్మిత కెరీర్, వ్యక్తిగత అంశాలతో సాగిన ఈ  గ్లింప్స్‌ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో స్మిత పాత్రను చంద్రిక రవి పోషిస్తోంది. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? 

Also Read: 'పీలింగ్స్' సాంగ్ వచ్చేసింది.. ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపిన బన్నీ

Advertisment
Advertisment
తాజా కథనాలు