KTR: పైసా పనిలేదు.. రాష్ట్రానికి లాభం లేదు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

TG: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో పైసా పని లేదు.. రాష్ట్రానికి లాభం లేదని అన్నారు కేటీఆర్. 10నెలల్లో 25 సార్లు హస్తిన పర్యటనకు రేవంత్ వెళ్లారని అన్నారు. అధిష్టాన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సీఎం రేవంత్ సిల్వర్ జూబ్లీ చేశాడని సెటైర్లు వేశారు.

KTR: రాజకీయ కక్షతో రైతులను ఆగం చేయొద్దు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ కీలక సూచన!
New Update

MLA KTR : సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శల దాడికి దిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన వల్ల పైసా పనిలేదు.. తెలంగాణకు ఉపయోగం లేదంటూ దండించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి సీఎం కూర్చున్న 10 నెలల్లో 25 సార్లు రేవంత్ ఢిల్లీకి వెళ్లారని.. దాదాపు 50 రోజులు అక్కడే ఉన్నారని అన్నారు.

ఇది కూడా చదవండి: నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

రేవంత్.. సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి!

పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి రేవంత్ అంటూ చురకలు అంటించారు. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు అని ఫైర్ అయ్యారు. అయినను పోయి రావాలె హస్తినకు అని అన్నారు. అన్నదాతల అరిగోసలు..  గాల్లో దీపాల్లా గురుకులాలు.. కుంటుపడ్డ వైద్యం.. గాడి తప్పిన విద్యా వ్యవస్థ.. అయినను పోయి రావాలె హస్తినకు అంటూ ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి భట్టి విక్రమార్క.. అధిష్టానంతో కీలక భేటీ!

అయినను పోయి రావాలె హస్తినకు...

మూసి పేరుతో - హైడ్రా (Hydra) పేరుతో  పేదోళ్ల పొట్టలు కొట్టి - 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని మండిపడ్డారు. పండగలు పండగళ్ళా  లేవని.. బతుకమ్మ పండుగ నాడు ఆడబిడ్డల చీరలు అందనేలేవు అని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచుతామని చెప్పిన మీ మాటలు నమ్మి ఓటు వేసిన అవ్వాతాతలు అనుకున్న పింఛను అందుతలేదన్నారు. తులం  బంగారం జాడనే లేదు.. టీలు లేవు, కుట్టు మిషిన్లు లేవు.. అయినను పోయి రావాలె హస్తినకు అంటూ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై ప్రశ్నలు సంధిస్తూ సెటైర్లు వేశారు కేటీఆర్.

ఇది కూడా చదవండి: జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు!

#ktr #revanth-reddy #twitter
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe