Hydra: హైడ్రాకు హైకోర్టు బిగ్ రిలీఫ్ TG: హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99, హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది. By V.J Reddy 16 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Telangana HYDRA: హైదరాబాద్ లో చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు రేవంత్ సర్కార్ హైడ్రా ను ఏర్పాటు చేసింది. కాగా సీఎం రేవంత్ (CM Revanth Reddy) తీసుకున్న ఈ నిర్ణయం పై ఒకవైపు ప్రసంశలు వస్తున్న మరోవైపు విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ హైడ్రా అంశం హైకోర్టుకు చేరింది. హైడ్రాను వ్యతిరేకించేవారు, హైడ్రా బాధితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని పిటిషన్ దారులు హైడ్రా కార్యాచరణకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్... రేపు కీలక ప్రకటన! హైడ్రాకు బిగ్ రిలీఫ్... హైడ్రాకు బిగ్ రిలీఫ్ దొరికింది. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99, హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇది కూడా చదవండి: నేడు కోర్టుకు సీఎం రేవంత్..కానీ! నిజం కాలం నాటి రెవెన్యూ చట్టం ప్రకారం ఏ రెవెన్యూ అధికారి అయినా, ఎప్పుడైనా సర్వే చేయవచ్చునని తెలిపింది. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు అధికారిని నియమించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే హైడ్రా ఏర్పాటు జరిగిందని పేర్కొంది. నిజాం కాలం నాటి రెవెన్యూ చట్టం ప్రకారం నోటీసు కూడా జారీ చేయాల్సిన అవసరం లేదని, FTL, బఫర్ జోన్లలో సర్వే చేసి అక్కడ ఉండే నిర్మాణాలు, ఆక్రమణలను కూల్చివేసే అధికారం ఉంటుందని హైడ్రా కు మద్దతుగా తన అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. ఆనాటి రెవెన్యూ చట్టానికి అనుగుణంగానే ఇరిగేషన్ చట్టం కూడా రూపొందిందని హైకోర్టు వివరించింది. FTL, బఫర్‌జోన్ల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఒక కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిందని గుర్తు చేసింది. ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్! 29కి వాయిదా... మూసీ ప్రాంతంలోని (Musi River) తమ ఇళ్లపై ఎర్రని అక్షరాలతో RBX మార్కింగ్ వేశారని.. ఏ క్షణమైనా కూల్చేసే అవకాశం ఉందంటూ పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఇంకొందరు బాధితులు .. ప్రైవేట్ పట్టా భూముల్లోకి హైడ్రా అధికారులు దౌర్జన్యంగా చొరబడి నోటీసు కూడా ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేశారని తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత లేదని.. వెంటనే కూల్చివేతలను ఆపేయాలని ఆదేంచాలంటూ బాధితుల తరఫు లాయర్లు హైకోర్టును కోరారు. GHMC చేసే పని హైడ్రా చేయడం కుదరదన్నారు. అయితే చట్టప్రకారం నోటీసులు జారీ చేసే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తరఫు ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైడ్రాకు సంబంధించిన జీవో 99ను సవాలు చేసిన వ్యాజ్యాలను డివిజన్ బెంచ్ విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే తదుపరి విచారణలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. విచారణను ఈనెల 29కు హైకోర్టు వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి! #hydra #telangana-high-court #cm-revanth-reddy #hydra-ranganath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి